Advertisement

కాజల్ ఏదో ఆశిస్తే..అక్కడేదేదో అయ్యింది..!


సినిమా ఛాన్స్‌ల కంటే యాడ్‌ల రూపంలో సెలబ్రిటీలు బాగా సంపాదిస్తున్నారు. అయితే అది అందరూ కాదండోయ్‌. పేరున్న పెద్ద సెలబ్రిటీలకు మాత్రమే ఈ అవకాశం ఉంది. ఇది వారికి అదనపు ఆదాయ వనరు. సినిమా కోసం నెలల పాటు కష్టపడితే వచ్చేది..రెండు మూడు రోజుల్లో వచ్చేస్తుంటే ఎవరు మాత్రం వదులుకుంటారు. అలా అనే కాజల్‌ అగర్వాల్‌ ఆ మధ్య అంటే అప్పుడెప్పుడో 2008లో ఓ హెయిర్‌ ఆయిల్‌ యాడ్‌ చేసింది. 

Advertisement

ఆ టైమ్‌లో కోకోనట్‌ హెయిర్‌ ఆయిల్‌ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేసిన కాజల్‌, తన కాంట్రాక్ట్‌ ముగిసినా..తను నటించిన యాడ్‌ని వాడుతున్నారని కోర్టులో కేసు వేసింది. ఇది కరెక్ట్‌ కాదని, తన అనుమతి లేకుండా ఇంకా ఆ యాడ్‌ని వాడుతున్నందుకు తనకు తగిన పరిహారం చెల్లించాలని కోర్టు మెట్లెక్కిన కాజల్‌ ని కోకోనట్‌ ఆయిల్‌ గట్టిగా తిప్పి కొట్టింది. 

కాంట్రాక్ట్‌ ముగిసినా కాపీ రైట్స్‌ చట్టం క్రింద ఆ యాడ్‌ను 60 ఏళ్ల పాటు వాడుకోవచ్చని కోకోనట్‌ ఆయిల్‌ తరపు న్యాయవాది వాదించడంతో..కాజల్‌ వాదనలో బలం లేదని కేసుని విచారించిన మద్రాస్‌ హైకోర్టు ..ఈ కేసుని కొట్టివేసింది. దీంతో కాజల్‌కి ఏం పోయింది అనుకుంటున్నారు కదా..! ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్‌. ఈ కేసుకు సంబంధించి సదరు కంపెనీ భరించిన ఖర్చులన్నీ కాజలే కట్టాలని ఓ మొట్టికాయ కూడా వేసిందని టాక్‌. 

Kajal Aggarwal Fined For Filing False Case In Madras Court:

South Indian actress Kajal Agarwal has suffered a setback in the Madras High Court after a suit filed by her in a copyright related case was dismissed by the court.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement