Advertisement

తెలుగు సినీ పరిశ్రమ ఏపీకి..నిజమే!


ప్రస్తుతం సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ఏపీ, తెలంగాణలుగా విడిపోయింది. చెన్నై నుంచి సినిమా పరిశ్రమ మొదట్లో హైదరబాద్‌కి తరలి వచ్చింది. దాంతో సినీ రంగానికి చెందిన పలువురు అక్కడే స్టూడియోలు, రికార్డింగ్‌ థియేటర్లు వంటివి కట్టుకుని, సొంత ఇళ్లను కూడా కట్టించుకుని స్థిరపడ్డారు. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్‌లోని మౌళిక సదుపాయాలు ఏపీలో లేవని, తాము హైదరాబాద్‌లోనే స్ధిరపడటం వల్ల ఏపీకి టాలీవుడ్‌ వెళ్లే పరిస్థితి కనిపించలేదు. 

Advertisement

ఇక సినీ ఇండస్ట్రీ తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉండటం నిజంగా తెలంగాణ రాష్ట్రానికి ఎంతో లాభదాయకం. ఇక ఏపీ సీఎం చంద్రబాబుకి సినిమా వారంటే బాగా గౌరవం. వారితో సత్సంబంధాలే కాదు.. వారిని తన పార్టీకి కూడా వాడుకుంటూ సినీ గ్లామర్‌ని బాగా ఉపయోగించుకోవాలని చూస్తూ ఉంటాడు. మినిస్టర్ గంటా శ్రీనివాసరావుది కూడా అదే స్థితి. దీంతో వీరు ఏపీలోని వైజాగ్‌, చెన్నైకి దగ్గరలోని నెల్లూరు జిల్లా బోర్డర్‌లో ఉన్న తడ వంటి చోట్ల స్టూడియోలు కట్టుకుంటామంటే ప్రోత్సహిస్తామని, ఏపీలో షూటింగ్‌లు జరుపుకునేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని ఏపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతోంది. 

మొదట్లో ఎవ్వరూ దీనిని పట్టించుకోకపోయినా టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో తెలంగాణ సర్కార్‌ కేవలం కావాలనే సినిమా వారిని టార్గెట్‌ చేస్తోందని పలువురు సినీ పెద్దలు భావిస్తున్నారు. దాంతో ఏపీ సీఎంతో వారు మరలా టచ్‌లోకి వస్తే ఆయన తమకు ఏపీకి వస్తే చేసే మేలు ఏమిటి? స్టూడియోలకు ఎంత మొత్తంలో స్థలాలు ఇస్తాడు? తమను ఎలా ట్రీట్‌ చేస్తాడు? అని ఒక వర్గం పరిశ్రమ ఆలోచిస్తోంది. డ్రగ్స్‌ కేసు వల్ల తెలుగు పరిశ్రమ నిట్టనిలువుగా రెండుగా చీలిన మాట వాస్తవమేనని సిని ఇండస్ట్రీ వారే అంటున్నారు. 

Telugu film Industry shifts to Andhra Pradesh:

The Andhra Pradesh government urged the Telugu film industry to make Viskhapatnam a centre for cinema.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement