Advertisement

బయ్యర్లు భయపడి పారిపోతున్నారు..!


'బాహుబలి'తో ఓవర్‌సీస్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా తెలుగు సినిమాలకు మార్కెట్‌ పెరిగింది. కానీ ముఖ్యంగా మంచి విభిన్న దర్శకులు, అభిరుచి ఉన్న నిర్మాతలు, వైవిధ్యం చూపించే హీరోల చిత్రాలను ఓవర్‌సీస్‌లో బాగా కలెక్ట్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్‌సీస్‌ ప్రేక్షకులు విభిన్నంగా ఉండే చిత్రాలను ఆదిస్తారు కాబట్టి ఆ దారిలో వెళ్తున్న సుకుమార్‌, దిల్‌రాజు, నాని, నిఖిల్‌, శర్వానంద్‌ వంటి వారి చిత్రాలను బాగా చూస్తున్నారు. 

Advertisement

ఇక చిన్న చిత్రంగా వచ్చిన 'పెళ్ళి చూపులు'కి వారు బ్రహ్మరధం పట్టారు. ఇక భారీ బడ్జెట్‌తో నిర్మాత దిల్‌రాజు - హరీష్‌శంకర్‌- అల్లు అర్జున్‌ -దేవిశ్రీప్రసాద్‌ వంటి టాప్‌ క్యాస్టింగ్‌, అత్యుత్తమ సాంకేతిక నిపుణులు పని చేసిన 'డిజె', మహేష్‌ బాబు 'బ్రహ్మూెత్సవం', పవన్‌ 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' ల కంటే వైవిధ్యమైన చిన్నచిత్రాల వైపు మన ఓవర్‌సీస్‌ డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వస్తున్నారు. 'డిజె' ఓవర్‌సీస్‌లో నష్టాలను నమోదు చేసింది. దర్శకనిర్మాతలు, హీరోలు ఎంతగా గట్టిగా అరిచినా, అమెరికా వెళ్లి ప్రచారం చేసినా రొటీన్‌ కంటెంట్‌ కావడంతో వారు పెదవి విరిచాడు. కానీ దానికి భిన్నంగా దిల్‌రాజునే నిర్మించిన 'ఫిదా' చిత్రం రెండు మిలియన్లు దాటుతోంది. ఇప్పటి వరకు ఈ రేర్‌ ఫీట్‌ని సాధించిన చిత్రాలను వేళ్ల మీద లెక్కించవచ్చు. 

ఇక ఈ పెద్ద సినిమాల భయంతో త్వరలో విడుదల కానున్న మహేష్‌-మురుగదాస్‌ల 'స్పైడర్‌', ఎన్టీఆర్‌ 'జై లవ కుశ' చిత్రాలను నిర్మాతలు చెప్పిన దానికంటే దాదాపు సగం ధరకే అమ్ముడుపోయాయి. అయినా ఆ మొత్తమైనా రావాలంటే ఈ రెండు చిత్రాలు కూడా రెండు మిలియన్‌ క్లబ్‌ని దాటాల్సి వస్తుంది. మొత్తానికి కొత్త తరహా చిత్రాలు ఓవర్‌సీస్‌ ప్రేక్షకుల పుణ్యమా అని బాగా ఎంకరేజింగ్‌గా ఉండటం సంతోషకరమైన విషయంగానే చెప్పాలి...! 

Jai Lava Kusa and Spyder Movies Overseas Deal Closed:

According to the latest update, the overseas deal of Jai Lava Kusa has been closed price  of Rs 10.5 Cr. Spyder movie also has been overseas deal closed recently.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement