Advertisement

బాలయ్య భలే ఎత్తులు వేస్తున్నాడు..!


ప్రస్తుతం బాలకృష్ణ అనంతపురం జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఆ నియోజక వర్గంలో బైక్‌ ర్యాలీ నడిపి, హెల్మెట్‌ పెట్టుకోలేదని, ఇక పలు ప్రారంభోత్సవాలు, కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన తోటి సిబ్బంది, స్థానిక నాయకుల మీద, అధికారుల మీదే కాకుండా కార్యకర్తలను కూడా చీదరించుకొని, తన అసహానంతా చేతల్లో చూపించడం వివాదాస్పదమైంది. 

Advertisement

మరోపక్క టిడిపికి పెట్టని కోట అయిన హిందూపురం ప్రజల బాధలను పట్టించుకోకపోవడం, ఎవ్వరికీ అందుబాటులో ఉండకపోవడం, ఆయన పేరు చెప్పి, ఆయన పీఎలదే ఇష్టారాజ్యం కావడంతో నియోజకవర్గ ప్రజలే తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. బాలయ్య తీరు పట్ల టిడిపి, ఎన్టీఆర్‌, బాలయ్యల వీరాభిమానులు, స్థానిక నాయకులు, జిల్లాలోని ఇతర నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా రగిలిపోతున్నారు. ఇలాగైతే వచ్చే ఎన్నికలలో హిందూపురం నుంచి బాలయ్య మరలా పోటీ చేస్తే ఓడిస్తామని చెబూతూ, పశువుల మీద బాలయ్య పేర్లు రాసి ఊరేగించడం, పోలీస్‌ స్టేషన్‌లో తమ ఎమ్మెల్యే కనిపించడం లేదని ఫిర్యాదులు చేసే దాకా వ్యవహారం వెళ్లింది. 

మరోవైపు తాను వచ్చే ఎన్నికలలో అనంతపురంలోని ఏదో స్థానానికి పోటీ చేస్తానని జనసేనాధిపతి పవన్‌ అంటున్నాడు. దీంతో ఈ గొడవ నాకెందుకులే అనిభావిస్తున్న బాలయ్య 2019 ఎన్నికల్లో తన సొంత జిల్లా అయిన కృష్ణాజిల్లాలోని గుడివాడ నుంచి కానీ లేదా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గానీ పోటీచేస్తే తాను గెలుస్తానని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా గుడివాడను టార్గెట్‌ చేసుకుంటే కొడాలినానిని ఓడించడంతో పాటు తన గెలుపు నల్లేరు మీద నడక అవుతుందని,తద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టినట్లు అవుతుందని ఆలోచనచేస్తున్నాడట. అదే సమయంలో జనసేన తరపున గుంటూరు ఎంపీ స్థానానికి నటుడు శివాజీ, కాకినాడకు నాగబాబు పోటీ చేస్తారని కూడా ఇప్పటినుంచే వార్తలు జోరందుకున్నాయి. 

 

Balakrishna 2019 Elections Competition From Gudiwada or Vijayawada:

Pawan said he would contest a seat in Anantapur in the next elections. Balaiah is reported to have hoped to win if he is contesting from Gudivada in Krishna district of his home district in 2019 or from contesting from Vijayawada East constituency.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement