Advertisement

మోదీ దెబ్బకు కంటైనర్‌ కాస్తా..బొలేరోగా మారింది!


అల్లు అర్జున్‌ నటించిన 'జులాయి' చిత్రంలో బ్యాంకు నుంచి కొట్టేసిన 1500  కోట్లను భారీ కంటైనర్‌లో వైజాగ్‌ నౌకాశ్రయానికి చేర్చే ప్రయత్నం జరుగుతుంది.. అల్లు అర్జున్‌, రాజేంద్ర ప్రసాద్‌లు ఆ కంటైనర్‌ను హెలికాప్టర్‌ తో అనుసరిస్తారు. ఇక 'డిజె' చిత్రంలో బన్నీ హీరో విలన్‌ కొడుకును వెర్రిబాగుల వాడిని చేసి ఏకంగా 9 వేలకోట్లను ఓ బొలేరో వ్యాన్‌లో తెస్తాడు. 

Advertisement

కారణం ఒక్కటే నాడు 'జులాయి' సమయానికి కేవలం 1000 నోటు మాత్రమే గరిష్ట నోటు. కానీ మోదీ పెద్ద నోట్ల పుణ్యమా అని 2వేల నోటు కూడా వచ్చింది.. సో.. ఇదే లాజిక్‌ అని ఎవరికివారు సరిపెట్టుకుంటున్నారు. మరో పక్క మీ రివ్వ్యూలు మమ్మల్నేమీ చేయలేవని ఎగతాళి చేసిన హరీష్‌ శంకర్‌, దిల్‌ రాజులకు దిమ్మ తిరిగే షాక్‌ కొట్టింది. అన్ని వెబ్‌సైట్లలో నెగటివ్‌ రివ్యూలు రావడం ఓవర్‌సీస్‌లో భారీ నష్టాలను తెచ్చిపెడుతోంది. డాలర్లలో కుటుంబం మొత్తం, అదీ 3గంటలు సమయం కేటాయించి వెళ్లే ఓపిక వీరాభిమానం అక్కడ ఉండదు. 

ఇక రేట్లను అక్కడ కూడా బాగానే పెంచారు. దాంతో అమెరికాలో ఈ చిత్రాన్ని భారీ ధరకు కొన్న డిస్ట్రిబ్యూటర్లకు పెట్టుబడి మొత్తంలో సగానికి సగం నష్టపోయే పరిస్థితి ఉందంటున్నారు. వాస్తవానికి అమెరికాలో 'ట్యూబ్‌లైట్‌'కు కూడా నెగటివ్‌ టాక్‌ వచ్చి వసూళ్లులేవు. 'డిజె' పరిస్థితి కూడ అదే. విచిత్రంగా అనిపించే విషయం ఏమిటంటే... అమెరికాలోని ప్రేక్షకులు ఎక్కువగా విభిన్న చిత్రాలను, ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలను బాగా ఆదరిస్తారు. 'ట్యూబ్‌లైట్‌' వైవిధ్యభరిత చిత్రమైనా, 'డిజె' ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉన్న చిత్రమే అయినా ఓవర్‌సీస్‌ ప్రేక్షకులు మాత్రం ఈ రెండు చిత్రాలకు బాయ్ కొట్టారు. 

Modi Mark and Julayi sentiment in DJ Movie:

Allu Arjun Duvvda Jagannadham Movie Drops in Overseas Market
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement