Advertisement

షర్మిలక్కే కావలట....!


అసలు రాష్ట్ర విభజన చేసిన తర్వాత వైసీపీ తెలంగాణను పట్టించుకోవడమే మానేసింది. కేవలం ఏపీలో ఉంటే చాలని భావిస్తోంది. కనీసం టిడిపిలోనైనా రేవంత్‌రెడ్డి, రమణలున్నారు. వైసీపీ అయితే బిచాన ఎత్తేసింది. పోనీ ఆ రాష్ట్రాన్ని వదిలేసారా అంటే అదీ లేదు. తాజాగా తెలంగాణ వైసీపీ ప్లీనరి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీకి చెందిన సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం తెలంగాణ విషయం పక్కనపెట్టామని, ముందుగా 2019లో ఆంధ్రాలో అధికారంలోకి రావడం ఖాయమని, ఆ తర్వాత తెలంగాణ సంగతి చూద్దామని ప్రసంగించడంతో ఆ ప్లీనరీకి వచ్చిన కార్యకర్తలు, నాయకులు తీవ్ర అసంతృప్తికిలోనై ఉత్సాహం కోల్పోయారు.

Advertisement

కనీసం తమను ఉత్సాహపరచడానికైనా తెలంగాణలో బలం చాటుదాం అని ఎందుకు అన లేదని, లోపాయికారీగా టీఆర్‌ఎస్‌ని చూసి భయపడి సజ్జల అలా మాట్లాడాడని అంటున్నారు. మరోపక్క ఈ ప్లీనరీకి జగన్‌తో సహా ఆయన కుటుంబీకులెవ్వరూ హాజరుకాలేదు. మరి వైజాగ్‌కి వెళ్లిన జగన్‌ ఇక్కడికి ఎందుకు రాలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైసీపీ మొదటి తెలంగాణ ప్లీనరీకి ఆయన హాజరుకాకపోవడంపై కార్యకర్తలు మండిపడుతున్నారు.

మరోపక్క ఈ ప్లీనరీలో మట్లాడిన నాయకులంతా జగన్‌ ఆంధ్రాని చూసుకున్నా, తెలంగాణకు మాత్రం ఆయన సోదరి షర్మిలాను నాయకురాలిని చేయాలని సూచించారు. మరోపక్క జగన్‌ ఈ మధ్య పార్టీ సీనియర్‌ నాయకులనే కాదు.. తన సోదరి షర్మిలా, బావ అనిల్‌ కుమార్‌లతో పాటు స్వయంగా తల్లి విజయమ్మను కూడా దూరంగా పెట్టాటనే విమర్శలు ఎక్కువయ్యాయి..! 

Sajjala Ramakrishna Reddy said About AP TDP:

After the division of the original state, the YCP withdrew to the attention of Telangana.  Only in AP is going to have it.  The latest Telangana YCP plenary meetings were held.  Speaking on the occasion, party leader Sajjala Ramakrishna Reddy said that the Telangana issue has now been put on hold and it was in power in Andhra Pradesh in 2019,
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement