Advertisement

బాబును మోదీ అవమానించాడా...?


తాజాగా బిజెపి, ఎన్టీయేల బల నిరూపణగా జరిగిన రామ్‌నాద్‌ కోవింద్‌ రాష్ట్రపతి నామినేషన్‌ను ఆర్బాటంగా జరిపిన సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం చంద్రబాబునాయడు, మద్యప్రదేశ్‌, మహారాష్ట్ర సీఎంలతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా హాజరయ్యారు. వీరు కలిసి ముచ్చటించుకునే సమయంలో మోదీ.. కేసీఆర్‌ని మీ రాష్ట్రంలో వర్షాలు ఎలా కురుస్తున్నాయ్‌? అని ప్రత్యేకంగా అడగ్గా బాగున్నాయి అని కేసీఆర్‌ చెప్పాడట. 

Advertisement

దానికి ఏపీ సీఎం చంద్రబాబు గత రెండేళ్లుగా తెలంగాణలో వర్షాలు బాగానే పడుతున్నాయి. కానీ మా రాష్ట్రంలో మాత్రం కురవలేదని సమాధానం ఇచ్చాడట. ఇక మహారాష్ట్ర, మద్యప్రదేశ్‌ సీఎంలు కూడా తమ రాష్ట్రాలు వర్షలేమితో బాధపడుతున్న సంగతులను పనిలో పనిగా చంద్రబాబుకు వంత పాడగా, మోదీ మాత్రం కేసీఆర్‌ని ఉద్దేశించి, మీరు ఇరిగేషన్‌పై బాగా దృష్టిపెడుతున్నారు. చెక్‌డ్యాంలు, చెరువుల పూడిక తీత, మిషన్‌ భరీరధ వంటివి చేస్తున్నారు కదా...! అదే మీకు మంచి చేస్తోందని అన్నాడట. 

దాంతో చంద్రబాబు తాను పట్టిసీమను రికార్డు స్థాయిలో పనిచేశానని, పోలవరం పనులు ఊపందుకున్నాయని, ప్రతి సోమవారం సమీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పినా మోదీ మౌనంగా ఉండటంతో కేసీఆర్‌ ముందు మోదీ తనను అవమానించాడని బాబు ఫీలయినట్లు వార్తలు వస్తున్నాయి. అయినా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ సీఎంలకు లేని అవమానం తనకే కలిగిందని బాబు ఎలా భావిస్తున్నాడు? గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా ఉందని కొందరు సెటైర్లు వేస్తున్నారు. 

Modi Insults Chandrababu Naidu:

Narendra Modi Praises Telangana CM KCR at PRESIDENTIAL ELECTIONS
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement