Advertisement

పాలల్లో కల్తీ... చిక్కుల్లో హెరిటేజ్‌..!


ఇటీవల తమిళనాడు మంత్రి రాజేంద్రబాలాజీ రాష్ట్రంలో అమ్ముతున్న పాలలో కల్తీ జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. కానీ ముఖ్యమంత్రి పళనిస్వామి మాత్రం ఆ విషయం బహిరంగంగా చెప్పవద్దని, చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ పాలే తమిళనాడులో ఎక్కువగా అమ్ముతున్నందున ఆ విషయం ప్రస్తావించవద్దని, బాబుతో వైరం తెచ్చుకుంటే ప్రభుత్వానికే ముప్పని మంత్రిని మందలించారు. 

Advertisement

ఆ తర్వాత హెరిటేజ్‌ వ్యవహారాలు చూస్తున్న బ్రాహ్మణి మాట్లాడుతూ, తమ కొడుకు దేవాన్ష్‌ కూడా హెరిటేజ్‌ పాలనే తాగుతాడని, చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన పాదయాత్రలో సైతం బలం కోసం హెరిటేజ్‌ పాలనే తాగాడని భుజాలు తడుముకుంది. కాగా నేడు తమిళనాడు ప్రజలు ప్రైవేట్‌ పాలు అంటే భయపడుతున్నారు. ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మధురైలో జిల్లా కలెక్టర్‌ ప్రజల ఆందోళనపై స్పందించారు. ప్రైవేట్‌ పాలను సేకరించి, తానే స్వయంగా పాల పరిశోధనలో పాల్గొన్నాడు. 

ఈ సందర్భంగా పాలను పరీక్షించిన పరిశోధకులు ప్రైవేట్‌ పాలల్లో సోపు ఆయిల్‌ కలుపుతున్నారని తేల్చేశారు. పాలలో నురుగ బాగా రావడానికి వాటిని కలుపుతున్నారని, పాలలో నురుగ ఎక్కువగా రావడానికి అది తోడ్పడుతుందని, పాలలో కల్తీ నిజమేనని కలెక్టర్‌తో పాటు అధికారులు కూడా తేల్చేశారు. మరి ఈ విషయంలో బాబు తనకున్న పలుకుబడితో తప్పించుకున్నా కూడా ఆయన సంస్థపై పడిన మచ్చ మాత్రం ఎప్పటికీ తొలగిపోదని, ఎన్ని ప్రకటనలు, కల్తీ లేదని వాదించినా కూడా చంద్రబాబు హెరిటేజ్‌పై ప్రజలకు నమ్మకం పోయిందని తమిళనాడు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వ్యాపారాల కోసం పసిపిల్లలు తాగే పాలలో కూడా కల్తీచేయడం చూస్తే కాదేదీ కల్తీకి అనర్హం అనే చెప్పాలి. 

Heritage Milk again in the News:

Tamil Nadu Madhurai Collector Tests Heritage Milk and Found in Soap Oil. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement