Advertisement

రజినీ స్కెచ్‌ అదిరింది..!


తలైవా రాజకీయ రంగ ప్రవేశంపై ఇప్పుడు రోజు రోజుకూ వేడిపెరుగుతోంది. పలువురు ఆయన్ను సీఎంగా అంగీకరించమని, ఆయన తమిళనాడు వాసి కాదని ధ్వజమెత్తుతున్నారు. వాటికి రజినీ తన అభిమానులతో ప్రసంగింటేప్పుడు సుత్తిమెత్తగా సమాధానం చెబుతున్నాడు. మరోపక్క అనవసర విషయాలను పట్టించుకోకుండా తన దారిలో తాను వెళ్తున్నాడు. ఇక ఆయన బిజెపితో సహా ఏ ప్రాంతీయ పార్టీలోనూ చేరే ఉద్దేశ్యం లేదని అంటున్నారు. 

Advertisement

సొంతగా ఓ పార్టీని, జెండాను, సింబల్‌ను గుర్తించే పనిలో ఆయన ఉన్నాడు. తమిళనాడులో ఇప్పుడిప్పుడే ఎన్నికలు వచ్చే సీన్‌ లేదు. కానీ పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు తమిళనాడు అసెంబ్లీకి కూడా ఒకేసారి ఎన్నికలు జరిగే వీలుందని అంటున్నారు. మరోపక్క తన రాజకీయ ప్రవేశంపై ఆయన ఇప్పటికీ పూర్తి క్లారిటీ ఇవ్వడం లేదు. దేవుడు ఆదేశించాలంటున్నాడు. ఇక '2.0'తో పాటు ధనుష్‌ నిర్మాతగా, రంజిత్‌పా దర్శకత్వంలో ఆయన నటించే మూవీ 'కాలా' ఫస్ట్‌లుక్‌ కూడా రిలీజైంది. 

ఈ చిత్రంలో రజినీ దళిత, బడుగు, బలహీన వర్గాలకు మేలు చేసే గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నాడు. మరి రాజకీయాలలోకి రావాలంటే రజినీ కొత్త సినిమా ఎందుకు ఎంచుకుంటాడు? అనే విషయంపై విస్తృత చర్చ జరుగుతోంది. కానీ ఆయన ఎవ్వరికీ అర్దం కాకుండా లోతైన ఆలోచనలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన కొత్తగా ఓ పార్టీ పెట్టి దానికి కేవలం అధ్యక్షునిగా, లేదా ప్రధాన కార్యదర్శిగా ఉంటాడని, సీఎం అభ్యర్థిగా మరోకరిని ప్రకటించనున్నాడని సమాచారం. తమిళనాడులో పుట్టిన సీనియర్‌ ఐఏయస్‌ అధికారి సగాయంకు అక్కడి యూత్‌లో, చదువుకున్న వారిలో మేధావులలో పెద్ద ఎత్తున ఫాలోయింగ్‌ ఉంది. 

ఆయన ఏ పార్టీ అధికారంలో ఉన్న రాజకీయాల నాయకులను అసలు లెక్క చేయడు. గతంలో డీఎంకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సీఎం రుణానిధి పెద్దకుమారుడు అళగిరి, పంట పొలాలకు, తాగునీటికి వచ్చేనీటిని తన ప్రైవేట్‌ కాలేజీలకు మళ్లిస్తుండటంతో కరుణా, స్టాలిన్‌, అళగిరిలతోనే ఫైట్‌ చేశాడు. ప్రజల కోసం ప్రాణాలర్పిస్తాడనే పేరు ఆయనకు తమిళనాట ఉంది. ఇక జయ హయాంలో తాను పనిచేస్తున్న జిల్లాలో మైనింగ్‌ మాఫియా, ఇసుక మాఫియా చేస్తున్న వారి ఆటలు కట్టించాడు. 

దాంతో జయ ఆయనకు వ్యతిరేకంగా పలు బెదిరింపులు చేసింది. కానీ ఆయన చెన్నై హైకోర్ట్‌కు వెళ్లి, మాఫియా అంతం చూసే దాకా నిద్రపోలేదు. సో.. ఆయన తమిళుడు, నిజమైన నిజాయితీపరుడు కావడంతో రజనీ ఆయన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి, తనను తమిళనాడు స్థానికుడు కాదు అని వాదించే వారికి చెక్‌ పెట్టనున్నాడు. అందుకే ఆయన సినిమాలు కూడా కొనసాగిస్తున్నాడని సమాచారం. 

Rajinikanth sketch is Super..!:

Talaiva's political career is now hotter day by day. On the other hand, he does not give a full clarity on his political entrance. Rajinikanth said he would announce another candidate as CM candidate.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement