Advertisement

'బాహుబలి' దెబ్బకు మిగిలిన చిత్రాలు బలి..!


'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' జోరు మొత్తం నెల రోజుల పాటు ఉండేలా కనిపిస్తోంది. ఇప్పటికీ అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలలో ఈ చిత్రం విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్‌ ఫుల్స్‌తో నడుస్తోంది. ఈ శుక్రవారం వచ్చిన శర్వానంద్‌ 'రాధ', రాహుల్‌ 'వెంకటాపురం', 'రక్షకభటుడు' చిత్రాలు థియేటర్లు ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి. తమిళ, మలయాళ భాషల్లో కూడా కొత్త చిత్రాలను రిలీజ్‌ చేయడానికి భయపడుతున్నారు. 

Advertisement

ఇక హిందీలో వర్మ - అమితాబ్‌ బచ్చన్‌ల 'సర్కార్‌3', 'మేరీ ప్యారీ బిందు' చిత్రాలకు అసలు థియేటర్లే దొరకని పరిస్థితి. విడుదలైన థియేటర్లు కూడా టిక్కెట్లు తెగక నానా అగచాట్లు పడుతున్నారు. ఈ 'బాహుబలి' మేనియా ఎంతకాలం? ఎక్కడ ఎక్కడ ఉంటుందో ట్రేడ్‌ పండితులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఇక ఈ చిత్రం విడుదలైన వెంటనే దీనిపై పలు విమర్శలు సంధించిన తుగ్లక్‌ కమల్‌ ఆర్‌ ఖాన్‌ ఇప్పుడు తప్పును తెలుసుకున్నాడు. 

తాను రాజమౌళిని చుతియా డైరెక్టర్‌ అని, ప్రభాస్‌ని ఒంటెలా ఉన్నాడని చేసిన వ్యాఖ్యలకు సారీ చెప్పాడు. తనకు నచ్చకపోయినా, ప్రజలకు నచ్చిందని, ప్రజల తీర్పే శిరోధార్యంగా భావించి దర్శకుడు రాజమౌళికి, ప్రభాస్‌కు సారీ చెబుతున్నానని ట్వీట్‌ చేశాడు. 'బాహుబలి' ఓ సినిమా కాదు.. ఓ మహోద్యమం. ప్రతి ఒక్కరు దానిలో భాగస్వాములు కావాలనుకుంటున్నారు... బాహుబలి సృష్టించిన ఉద్యమాన్ని తిరగరాయడం మరో 30ఏళ్ల వరకు ఎవ్వరికీ సాధ్యంకాదని తేల్చిచెప్పడం గమనార్హం. 

Radha, Venkatapuram and Rakshaka Bhatudu Movies No Audience in Theaters:

The 'Baahubali-The Conclusion' appear to be the whole month. In all major cities and towns, the movie is being run with all the theaters released with housefulls. The sharwanand 'Radha', Rahul 'Venkatapuram' and 'Rakshaka Bhatudu' are coming up this Friday with theater no viewers.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement