Advertisement

మరో పప్పుకు అధికారం ఖాయం..!


ఏపీలో పప్పు ఎవరంటే ఎవరైనా లోకేష్‌బాబు అని చెబుతున్నారు. ఇక దేశంలో పప్పు ఎవరని అడిగితే ఠక్కున రాహుల్‌గాంధీ అనే పేరు వినిపిస్తుంది. తన రాజకీయ అజ్ఞానంతో పార్టీని నడపలేక నానా తంటాలు పడుతున్నాడు. యువ నాయకత్వం కోసం ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నా కూడా దానిని క్యాష్‌ చేసుకోలేకపోయాడు. ఇప్పటికీ అమ్మచాటు బిడ్డగానే ఉన్నాడు. 

Advertisement

మరోపక్క ప్రధానిగా దిగ్గజుడైన మోదీ ఉండటంతో రాహుల్‌ది దిక్కుతోచని పరిస్థితిగా మారింది. మోదీ వాగ్బాణాల ముందు కనీసం నిలబడలేకపోతున్నాడు. యువతను ఆకర్షించడంలో, దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను మరలా బలపర్చేలా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాడు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఎంత పోరాడినా డిపాజిట్లు గల్లంతే. నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎదుర్కొన్న బాధలను సద్వినియోగం చేసుకోలేక చతికిలపడ్డాడు. ఎంతైనా గాంధీ అనే తోక ఉంది. అమ్మ సోనియమ్మది తల్లి ప్రేమ కదా...! అందుకే ప్రధానమంత్రి పదవిలో రాహుల్‌ను చూడాలని ఇటలీ దేవుళ్లకి మొక్కుకుంటోంది. అయినా కూడా రాహుల్‌ను పప్పు అని అందరూ తేల్చేశారు. 

కానీ సోనియమ్మతో పాటు కాంగ్రెస్‌ వీరవిధేయులందరూ కలిసి ఇప్పుడు త్వరగా రాహుల్‌గాంధీకి కాంగ్రెస్‌ అధ్యక్ష పగ్గాలను అప్పగించాలని నిర్ణయించారట. తాజా సమాచారం ప్రకారం అక్టోబర్‌లో రాహుల్‌ను పట్టాభిషేకం చేయనున్నారు. కనీసం కాస్త దూకుడు, ఆకర్షణ శక్తి కలిగిన ప్రియాంకానే రాహుల్‌ కంటే బెటర్‌ అనే సెటైర్లు బాగానే వినిపిస్తున్నాయి. రాహుల్‌ పగ్గాలు చేపడితే మాత్రం ఇక బిజెపి నాయకులు పండగ చేసుకోవచ్చు. 

Rahul Gandhi-President ot the Congress Party Soon:

Congress party Members unanimously expressed their strong sentiment that accepting the wishes of crores of Congress workers and well wishers, Rahul Gandhi take over as the president of the Congress party.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement