Advertisement
Google Ads BL

పివి సింధు.. నీ వదలడం లేదు..!


ఒలింపిక్ లో భారతదేశాన్ని గర్వపడేలా చేసిన బ్యాట్మెంటన్ ఛాంపియన్ పివి సింధు గురించి అందరికి తెలుసు. ఒకే ఒక్క సిల్వర్ పతకంతో దేశం మొత్తం చూపు ఆమెవైపు తిప్పుకుంది. దీనికోసం ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలో చాలా శ్రమించింది. ఇక ఆమె బ్యాట్మెంటన్ కే కాక ఇప్పుడు కొన్ని యాడ్స్ లో కూడా నటిస్తుంది. ఇకపోతే క్రీడాకారుల జీవితాల్ని తీసుకుని సినిమాలు తెరకెక్కిస్తున్న బాలీవుడ్ దర్శకులు కన్ను ఇప్పుడు పివి సింధు బయోపిక్ మీద పడిందట. ఇప్పటికే పలు రంగాలలో రాణించిన క్రీడాకారుల బయోపిక్స్ ని తెరకెక్కించి సూపర్ హిట్స్ కొడుతున్న వీరికి ఇప్పుడు పివి సింధు జీవితాన్ని కూడా వెండితెర మీద ఆవిష్కరించాలని కోరిక పుట్టిందట.

Advertisement
CJ Advs

అయితే పివి సింధు బయోపిక్ ని బాలీవుడ్ నటుడు సోనుసూద్ తెరెకెక్కించబోతున్నానని ప్రకటించిన దగ్గరనుండి పివి సింధు పాత్రలో ఏ హీరోయిన్ చేస్తుంది.... కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్రకి ఎవరిని ఎంపిక చేస్తారనే టాపిక్ ఇప్పుడు హైలెట్ అయ్యింది. అయితే సోనూసూద్ నిర్మించే ఈ చిత్రంలో పివి సింధు పాత్రకి దీపికా పదుకొనె అయితే బావుంటుందని అంటున్నారట. మరో వైపు తెలుగులో ఆ పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్ చక్కగా సరిపోతుందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గోపీచంద్ పాత్రలో నిర్మాత అయిన సోనుసూదే నటించాలనుకుంటున్నాడట.

ఇప్పటికే మరో బ్యాట్మెంటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్ ని తెరకెక్కించడానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. అమోల్ గుప్త డైరెక్షన్  లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో సైనా పాత్రని శ్రద్ధ కపూర్ పోషిస్తుంది. 

Pusarla Venkata Sindhu aka PV Sindhu Biopic:

After Saina Nehwal; now a biopic on PV Sindhu (Pusarla Venkata Sindhu) to be made by Actor Sonu Sood. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs