Advertisement

పవన్‌, బాలయ్య మీరే నయమయ్యా.!


ఎంతో కాలంగా మన స్టార్స్‌ ఇక నుంచి ఏడాదికి రెండు చిత్రాలు చేస్తామని చెబుతూనే ఉన్నారు. అందరినీ ఊరిస్తూనే ఉన్నారు. కానీ అవ్వన్నీ నీటి మీద రాతలే. కబుర్లేనని అర్దమవుతోంది. తన 150వ చిత్రం 'ఖైదీనెంబర్‌150'తో దూకుడు చూపించి, వెంటనే సురందర్‌రెడ్డితో ఓ చిత్రం చేస్తున్నానని ప్రకటించిన చిరు ఇప్పటికీ ఆ చిత్రాన్ని పట్టాలెక్కించలేకపోయాడు. ఎన్టీఆర్‌ 'జనతాగ్యారేజ్‌' తర్వాత ఎన్నో కథలు, దర్శకులను మార్చి చివరకు 'జై లవ కుశ' అంటున్నాడు. ఇది మాత్రమే ఈ ఏడాది విడుదలవుతుంది. బన్నీ'దువ్వాడ జగన్నాథం'తోనే సరిపుచ్చుతున్నాడు. వక్కంతం వంశీ 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' ఈ ఏడాది వచ్చే పరిస్థితి లేదు. 

Advertisement

ప్రభాస్‌ 'బాహుబలి2'కే ఓకే. 'సాహో' వచ్చే ఏడాదే. మహేష్‌ 'బ్రహ్మోత్సవం' తర్వాత 'స్పైడర్‌' చేస్తూ 100 డేస్‌ టు గో.. 90డేస్‌ టు గో.. అంటూ సైడైపోయాడు. ఇక ఈ ఏడాది 'స్పైడర్‌' తప్ప మరో చిత్రం వచ్చే సీన్‌ లేదు. పవన్‌ మాత్రం ఆల్‌రెడీ 'కాటమరాయుడు'తో వచ్చాడు. త్రివిక్రమ్‌ సినిమా కూడా ఈ ఏడాదే రిలీజ్‌ కావడం ఖాయం. ఇక తన 100వ చిత్రం 'గౌతమీపుత్రశాతకర్ణి'తో వచ్చిన బాలయ్య పూరీ చిత్రాన్ని కూడా దసరాకు తెస్తున్నాడు. ఇలా ఉంది మన స్టార్స్‌ పరిస్థితి....! 

Pawan Kalyan, Balakrishna 2 Movies a Year:

Telugu heroes two films a year strategy. Balakrishna and Pawan Kalyan Success, But Others Heroes Failed. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement