Advertisement

చంద్రబాబుది ఇదో వ్యూహం..!


చంద్రబాబు నాయుడు బహు నేర్పరి. ముందుగా తానేమి భావిస్తున్నాడో దానిపై చూచాయగా వ్యాఖ్యలు చేసి, తన పార్టీలో, కార్యకర్తల్లో, ప్రజల్లో చర్చ జరిగేలా వ్యూహం పన్నుతారు. తాజాగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిపేలా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. దానికి అనుకూలంగా చంద్రబాబు ఇటీవలే మోదీకి తన మద్దతు కూడా తెలిపాడు. మరోపక్క తనకేమీ తెలియనట్లు ఈ అంశంపై చర్చ జరిగేలా చూస్తున్నాడు. 

Advertisement

మరోపక్క ఆయన కుమారునిగా, కాబోయే సీఎంగా ఆయన ప్రొజెక్ట్‌ చేస్తోన్న నారా లోకేష్‌ మరో విధంగా స్పందించాడు. ఏ రాష్ట్రం మాత్రం ఒక ఏడాది ముందే ఎన్నికలు వస్తే ఎందుకు ఒప్పుకుంటుంది? అసలు దేశవ్యాప్తంగా ఒకేసార పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం కూడా జరిగే పనికాదు.. ముఖ్యమంత్రి అలా ఎప్పుడు బహిరంగంగా చెప్పలేదు.. అని వ్యాఖ్యానించాడు. ఇంతకాలం కేవలం చంద్రబాబు కేవలం తన అభిప్రాయంపై మాత్రమే చర్చ జరిగేలా చూసేవాడు. 

కానీ ఇప్పుడు ఆయనకు ఆయన పుత్రరత్నం కూడా తోడవ్వడం బాగా కలిసొస్తోంది. దాంతో ఆయన ఒక విధంగా మాట్లాడి, కొడుకు చేత మరోరకంగా మాట్లాడిస్తున్నాడు. తాము ఐదేళ్లకు ఎన్నికైతే, అందునా కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఉంటే.. తాము ఒక ఏడాది ముందు ఎన్నికలకు వెళ్లడం వల్ల తమకు ఆర్థికంగా భారమే కాకుండా, రాజకీయ రీత్యా కూడా తాము అంత సాహసం చేయలేమని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. సో.. వారిని మరీ బాధపెట్టకుండా.. చంద్రబాబు తన ద్వంద నీతితో, రెండు వైపులా చర్చ జరిగేలా పావులు కదిపినట్లు కనిపిస్తోంది. 

chandrababu's one of the strategy!:

AP Chief Minister Chandrababu Naidu is talented CM. First let's comment on what he thinks, In the party, the activists and the people will have an arrangement for discussion. PM Narendra Modi Government is announcing it is hoped to take steps to conduct elections simultaneously across the country. Nara Lokesh is a upcoming AP CM talking different to Chandrababu naidu 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement