Advertisement

రాజమౌళి.. తీరేం బాలేదు..!


'బాహుబలి-దికన్‌క్లూజన్‌' చిత్రం విడుదలకు ముందే ప్రజల్లో ఎంతటి ఆసక్తిని మూటగట్టుకుందో.. భారీ రేట్లకు టిక్కెట్లను అమ్ముకోవడంతో పాటు తెలుగు మీడియాను చిన్నచూపుచూసిన విషయంలో అంతకంటే పెద్ద విమర్శలను ఎదుర్కుంటోంది. టిక్కెట్ల పెంపుపై సామాన్యుల నుంచి నెటిజన్లు.. మేథావులు, చివరకు యాంకర్‌ రవి వంటి వారు కూడా ప్రేక్షకుల బట్టలను కూడా వలిచేస్తున్న తీరుపై మండిపడుతున్నారు. మరోపక్క ఈ చిత్రం ఒక్క అమెరికాలోనే 100కోట్లు వసూలు చేస్తేగానీ సేఫ్‌గా బయటపడదు. దీనిని బట్టి ఈ చిత్రాన్ని ఎంత రేటుకు అమ్మారో అర్దమవుతోంది. 

Advertisement

అందుకే అమెరికాలో హాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్రాల టిక్కెట్లను కూడా 10డాలర్లకు అమ్ముతుంటే 'బాహుబలి2' టిక్కెట్లను 30డాలర్లకు పైగా అమ్ముతున్నారు. కానీ కెనడాలోని ఒట్టావా తెలుగు సంఘం వారు ఏకంగా బాహుబలి దోపిడీని నిరసిస్తూ ఈ చిత్రాన్ని బాయ్‌కాట్‌ చేశారు. దీంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్‌ దిగిరాకతప్పలేదు. మరోపక్క సీనియర్‌ బాలీవుడ్‌ హీరో వినోద్‌ఖన్నా మృతి వల్ల బాలీవుడ్‌ ప్రీమియర్‌షోలు ఆగిపోయాయి. 

ఇక తనను ఇంతటి వాడిని చేసి, తెలుగువారిగా గర్వంగా భావిస్తూ 'బాహుబలి2'కి ఇంతటి క్రేజ్‌ తేవడానికి కారణమైన తెలుగు మీడియాను రాజమౌళి తీవ్రంగా అవమానించారనే చెప్పాలి. 10వేల మంది కూడా తెలుగు వారు లేని విదేశాలకు వెళ్లి ప్రమోషన్స్‌ చేసి, పనిగట్టుకుని బాలీవుడ్‌ మీడియాను పిలిచి ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలిచ్చిన బాహుబలి అండ్‌కో తెలుగులో మాత్రం ఒకే ఒక్క పేపర్ కి మాత్రమే ఇంటర్వ్యూలిచ్చారు. అది ఎందువల్లో బహిరంగ రహస్యమే. కానీ మిగిలిన అందరికీ కలిపి ఓకే ఒక్క మూకుమ్మడి ఇంటర్వ్యూతో సరిపుచ్చి తమ సహజ దోరణిని చాటుకున్న బాహుబలి అండ్‌ యూనిట్‌ని ఎంత పొగిడినా కూడా తక్కువే. 

SS Rajamouli Neglecting Telugu Media:

Apparently, from the last couple of weeks, director Rajamouli and his Baahubali gang are busy promoting Baahubali 2, but most of the times they are seen exclusively on National television.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement