Advertisement

బాబును నమ్ముకుని బాగుపడుతున్నారు!


ఈనాడు రామోజీరావు, ఆంద్రజ్యోతి రాధాకృష్ణలు మొదటి నుంచి తెలుగుదేశంని నమ్ముకొని భారీగా లాభపడుతున్నారు. ఇక రామోజీకైతే కొన్ని నియమాలు, నిబంధనలైనా ఉన్నాయి. కానీ రాధాకృష్ణకు అవి కూడా లేవు. ఆయన జర్నలిస్ట్‌గా ఎదిగిన క్రమం అందరికీ తెలిసిందే. ఇక ఎన్‌టీవీ వంటి వాటిని కూడా మనం ప్రస్తావించుకోవాలి. వైసీపికి సాక్షి, టిడిపికి ఈనాడు, ఆంధ్రజ్యోతిల మద్య ఉన్న బంధం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈనాడులో చంద్రబాబుకి బాకా కొట్టినంత కాలం కొట్టి ఆ తర్వాత ఎన్‌టీవీకి వచ్చాడు కొమ్మినేని శ్రీనివాసరావు. ఇక చంద్రబాబుతో ఆయనకు ఎక్కడ చెడిందో తెలియదు గానీ ఒక్కసారిగా ఎన్‌టీవీలోని లైవ్‌ షో విత్‌ కెఎస్‌ఆర్‌లో ఆయన టిడిపిపై విమర్శల వర్షం కురిపించేవాడు. దానికి మొదట్లో ఎన్‌టీవీ యజమాని నరేంద్రచౌదరి కూడా సై అని చంద్రబాబుతో సై అంటే సై అన్నాడు. కానీ ఎన్నో ప్రయత్నాల తర్వాత చంద్రబాబు ఎన్టీవీ నరేంద్రచౌదరిని లైన్‌లోకి తెచ్చి నేడు టిడిపి అనుకూల చానెల్‌గా మార్చివేశాడు. దీంతో కొమ్మినేనికి సాక్షి చానెలే దిక్కయింది. 

Advertisement

ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఈనాడు రామోజీరావు ఆర్‌.ఎఫ్‌.సి విషయంలో ఎలా లబ్దిపొందాడో గమనించిన వేమూరి రాధాకృష్ణ, ఎన్టీవీ అధినేత నరేంద్రచౌదరిలు ఏపీలోని 13 జిల్లాల కేంద్రాలలో ప్రతి చోటా రెండు నుంచి మూడు ఎకరాల స్థలాలను తమకు ఇవ్వవలసిందిగా బాబుకు సిఫార్సు చేయించుకొని ముందుకు సాగుతున్నారు. మరి మీడియా దుస్థితి ఇలా దిగజారింది మరి..! ఇవ్వన్నీ ఎందుకని ఫీలయిన చంద్రబాబు మురళీమోహన్‌తో పాటు తన సన్నిహితుల చేత సొంతగా ఒక పత్రికను, చానెల్‌ను పెట్టే యోచనలో ఉన్నాడు. లోకేష్‌ రాజకీయ భవితవ్యానికి మీడియా తోడ్పాటు ఖచ్చితంగా కావాల్సిన నేపథ్యంలో బాబు ఈ పత్రిక, చానెల్‌లకు ఎవరిని ఎడిటర్‌గా పెట్టుకోవాలా? అనే మీమాంసలో ఉన్నట్లు సమాచారం. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement