Advertisement

జనసేన అధినేతకు ఓ మహిళ సలహా..!


గత ఎన్నికల్లో పవన్‌.. టిడిపి, బిజెపిలకు ఓట్లు వేయమని చెప్పారని, కాబట్టి ప్రజాసమస్యలపై ప్రభుత్వాలను నిలదీసే అర్హత పవన్‌కి ఉన్నాయని పవన్‌ అగ్రిగోల్డ్‌ బాధితులను కలుసుకున్న సందర్భంగా ఓ మహిళ చేసిన వ్యాఖ్యలు ఎంతో ఆలోచనాత్మకంగా ఉన్నాయి. పవన్‌ ఓదార్చి వెళ్లిపోవడం కాదని, తమ తరపున పోరాడాలని, తమకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వాలని అక్కడి బాధితులు తెలిపారు. ఈ అగ్రిగోల్డ్‌ విషయంలో కాంగ్రెస్‌, వైసీపీ, కాంగ్రెస్‌తో సహా అందరికీ బాధ్యత ఉంది. ఇక ఈ విషయంలో చంద్రబాబు తనయుడు లోకేష్‌తో సహా జగన్‌కి, టిడిపి మంత్రులకు, వైసీపీ ప్రజాప్రతినిధులకు కూడా భాగస్వామ్యం ఉంది. ఈ సంస్థను ఎత్తేసే సమయంలో కొందరు భాదితులు చంద్రబాబుకు, లోకేష్‌కు ఫిర్యాదు చేస్తామని, జగన్‌ని కూడా కలిసి సమస్యను వివరిస్తామని ఆ సంస్థ ప్రతినిధులకు చెప్పినప్పుడు వారు చెప్పిన సమాధానం ఎన్నో అనుమానాలను రెకెత్తించేదిగా ఉంది. 

Advertisement

మీరు జగన్‌కి బాధలు చెప్పగలరేమో? కానీ జగన్‌, లోకేష్‌ ఎవరికీ మాపై చర్యలు తీసుకునే దమ్ము లేవు. మీరు మహా అయితే ఒకరోజంతా వేచి ఉండి వారికి బాధలు చెప్పుకుంటారు. కానీ మేము తలుచుకుంటే మీరు చెప్పిన నాయకులందరితో ఈ రోజే కలిసి మేము డిన్నర్‌ చేయగలం.. అని ఆ సంస్థకు చెందిన ఓ ముఖ్యుడు అన్న మాటలు చూస్తుంటే.. అవి నేడు నిజమేనని నిరూపణ అవుతుంటే అవాక్కవ్వడం మనవంతు అవుతుంది. ఇక పవన్‌ కోర్టులు జోక్యం చేసుకోవాలని, సిబిఐ, టాస్క్‌ఫోర్స్‌ విచారణ చేయాలని డిమాండ్‌చేస్తున్నాడు. 

కానీ దీనిపై వైసీపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు కూడ వింటే ఆశ్యర్యపోవాలి. ఇప్పటికే మీరు మునిగి నాలుగైదేళ్లు అవుతోంది. ఇప్పుడు సుప్రీంకోర్టులకు, సిబిఐ విచారణకు వెళితే, అవి పరిష్కారం అయి నివేదిక రావాలంటే మీ జీవితకాలం చాలదని బెదిరింపు ధోరణితో సమాధానం ఇస్తున్నారు. మరోవైపు కేసు హైకోర్టులో ఉంది కాబట్టి మేమేం చేయలేమంటున్నారు. మరి ఇవి బెదిరింపులా? సలహాలా? తమిళనాడులో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ప్రకాష్‌రాజ్‌ ఢిల్లీలో ఆందోళన చేసి, జైట్లీతో మాట్లాడి సమస్య తీవ్రతను ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లాడని, పవన్‌ కూడా అదే బాటలో నడవాలని ఓ మహిళ ఇచ్చిన సూచన ఆలోచనాత్మకం...! 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement