Advertisement

'జై లవ కుశ' టైటిల్ పెడితే మూవీ ఫట్టేనా?


ఏ వుడ్ లోనైనా సెంటిమెంట్స్ కి కొదవ లేదు... అందులోను టాలీవుడ్ లో ఈ సెంటిమెంట్ కాస్త బలంగానే ఉంటుంది. ఒక సినిమా మొదలైందంటే ఆ సినిమాకి వేరే సినిమాకి పోలిక ఉందంటూ.. లేకపోతే ఆ టైటిల్ కి వేరే టైటిల్ కి పోలిక అంటూ.. మ్యూజిక్ విషయంలో కూడా ఈ ట్యూన్స్ ఆ సినిమాలోలా... వున్నాయంటూ అన్నిటికి పోలిక పెట్టేస్తూ సెంటిమెంట్ ని ముడివేస్తూ అసలు ఆ సినిమా హిట్ అవుతుందా లేకపోతే ఫట్టవుతుందా అంటూ లెక్కలు కట్టేస్తారు. 

Advertisement

ఇక ఈ సెంటిమెంట్ విషయం ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త సినిమాని తగులుకుంది. ఎన్టీఆర్ - బాబీ డైరెక్షన్లో తెరకెక్కే కొత్త చిత్రం మొదలు పెట్టి ఇంకా నెల కాలేదు అప్పుడే ఆ సినిమాపై రకరకాల కథనాలు ప్రచారమవుతున్నాయి. కళ్యాణ్ రామ్ తన బ్యానర్ లో 'జై లవ కుశ' అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించాడు. ఇక ఎన్టీఆర్ ఈ  చిత్రంలో మూడు విభిన్నమైన కేరెక్టర్స్ లో నటిస్తుండడంతో ఈ 'జై లవ కుశ'  టైటిల్ ఎన్టీఆర్ కి కరెక్ట్ గా సరిపోతుందని అందుకే దీని టైటిల్ ని కళ్యాణ్ రామ్ అలా రిజిస్టర్ చేయించాడని అంటున్నారు. అయితే ఆ టైటిల్ ఎన్టీఆర్ కొత్త చిత్ర టైటిల్ అంటూ ప్రచారం జరుగుతున్న వేళ ఆ టైటిల్ ఎన్టీఆర్ కి కలిసి రాదనే సెంటిమెంట్ లేవనెత్తారు కొందరు.

ఇప్పటి వరకు పాత సినిమాల టైటిల్స్ పెట్టి హిట్ కొట్టిన వారు లేరని అందుకే ఎన్టీఆర్ కి ఈ టైటిల్ సెంటిమెంట్ ప్రకారం కరెక్ట్ కాదని చెబుతున్నారు. అందుకు ఉదాహరణలుగా 'మాయాబజార్, శంకరాభరణం' చిత్రాలను చూపిస్తున్నారు. గతంలో ఈ చిత్రాలు రెండు ఎంత పెద్ద హిట్టో తెలిసిన విషయమే. అయితే దాసరి 'మాయాబజార్' చిత్ర టైటిల్ తో ఒక సినిమా చెయ్యగా అది ఘోరమైన ప్లాప్ అయ్యింది. అలాగే కోన వెంకట్ ఇష్టపడి 'శంకరాభరణం' ని తన కథకు అనుగుణంగా టైటిల్ పెట్టి పరాజయాన్ని చవి చూసాడు. మరి ఇప్పుడు ఎన్టీఆర్ తాతగారైన సీనియర్ ఎన్టీఆర్ నటించిన 'లవకుశ' అప్పట్లో సూపర్ హిట్. ఇప్పుడు కేవలం లవకుశకి 'జై' ని యాడ్ చెయ్యడం వలన 'జై లవ కుశ' సూపర్ హిట్ కొడుతుందని అనుకోలేమని సెంటిమెంట్ ని వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అయితే ఇప్పటివరకు 'జై లవ కుశ' చిత్ర టైటిల్ ని ఆ చిత్ర నిర్మాత అధికారికంగా ప్రకటించకుండానే ఇలా అనుమానాలను వ్యక్తం చెయ్యడం కాస్త విడ్డూరంగానే ఉంది మరి.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement