Advertisement

తమిళనాట అమ్మ మోత.!


తమిళనాడు రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా జయలలిత బ్రతికున్న కాలంలో ఆర్కేనగర్ అంటే అందరికీ వెల్ నోటెడ్ అన్నమాట. జయలలిత ఉన్న రోజుల్లో ఆ నియోజక వర్గంపై అమ్మకున్న పట్టు అలాంటిదన్నమాట. ప్రస్తుతం ఆర్కేనగర్ నియోజికవర్గం తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. ఏప్రిల్ 12వ తేది ఇక్కడ ఉప ఎన్నిక జరగనుండటంతో ప్రధాన పార్టీ నేతలంతా తమ అభ్యర్థులను సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా అభ్యర్ధుల ఎంపికలో ఆసక్తికరమైన రాజకీయం  చోటుచేసుకుంటుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే తిరుగుబాటు వర్గం అభ్యర్థిగా ఇ.మధుసూదనన్ ను రంగంలోకి దింపాడు. అయితే అన్నాడీఎంకే అసలైన వారసత్వంగా ప్రకటించుకుంటున్న  పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ తన మేనల్లుడు టీటీవీ దినకరన్ అధికార పక్షం నుండి రంగంలోకి దిగాడు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కూడా తాజాగా ‘ఎంజిఆర్ అమ్మ దీపా పరవై’ పార్టీ స్థాపించి ఆ పార్టీ తరఫున రంగంలోకి దిగనుంది. ఇంకా ఆసక్తికరమైన అంశం ఏంటంటే... దీప భర్త మాధవన్ కూడా మరో పార్టీ పెట్టి తమ అభ్యర్థిని బరిలోకి దింపనున్నట్లు ప్రకటించి సంచలనం రేపాడు. ఇలా జయలలిత వారసత్వాన్ని ఎవరికి వారు తాము సొంతం చేసుకోవడం కోసమని తెగ తాపత్రయ పడుతున్నారు. కాగా అన్నాడీఎంకె అభ్యర్థిగా దినకరన్ పేరు ప్రకటించిన కొంత సమయానికే  డీఎంకె పార్టీ కూడా మరుతు గణేష్ ను తమ అభ్యర్థిగా ప్రకటించడం విశేషం. ఇదిలా ఉంటే అన్నాడీఎంకే ఎన్నకల గుర్తు అయిన రెండు ఆకులు తమకే చెందాలని అటు శశికళ వర్గం, ఇటు పన్నీరు సెల్వం పోటాపోటీగా కాచుక కూర్చున్నారు. ఈ రెండాకుల గుర్తు తమకు రాలేదంటే జయలలిత గతంలో పోటీ చేసిన కోడిపుంజు గుర్తును ఎంచుకొనేందుకు పన్నీర్ వర్గం నిర్ణయించుకుంది కూడాను. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే... ఈ మధ్యనే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో మంచి ఊపుమీదున్న భాజపా సైతం ఆర్కే నగర్ ఉప ఎన్నికలో నటి గౌతమిని బరిలోకి దించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంది. 

Advertisement

అయితే ఆర్కే నగర్ ఉప ఎన్నిక నామినేషన్ దాఖలుకు చివరిరోజు మార్చి 23కాగా, పరిశీలన 24, ఉప సంహరణ 27గా ఖరారు అయింది. పోలింగ్ ఏప్రిల్ 12వ తేదీరోజు కాగా ఓట్ల లెక్కింపు 15న జరగనుంది. చూద్దాం ఎంతో ఆసక్తిరేపుతున్న ఆర్కేనగర్ ఉపఎన్నికలో అమ్మ వారసులుగా ఎవరు విజయం సాధిస్తారో. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement