Advertisement

కొడుకు కోసం..కేసిఆర్ రూట్లోనే..చంద్రబాబు..!


తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కుమారుడు కేటిఆర్ వలె ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ బాబుని తీర్చిదిద్దాలన్న ఉద్దేశ్యంలో ఉన్నట్టున్నాడు. అందుకనే చాలా కాలం నుండి రాజకీయాల్లోకి తీసుకొని ఏదో ఒక మంత్రి పదవి ఇచ్చి వారసుడి రాజకీయ ఆరంగేట్రాన్ని జరిపిద్దామన్న తలంపుతో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆ దిశగా ఇప్పటికి ఆ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తుంది. మొన్న తెదేపా పొలిట్ బ్యూరో సమావేశంలో లోకేష్ బాబుకు మంత్రిపదవి తదితర విషయాలపై విస్తృతంగా చర్చించి దానికి సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసేసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ కోసమని ఈనెల 6న లోకేష్ నామినేషన్ వెయ్యడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. దీనిని బట్టి క్యాబినెట్ లోకి లోకేష్ ఎంట్రీ దాదాపు ఖరారైనట్లేనని విదితమౌతుంది.

Advertisement

అయితే లోకేష్ కు ఏ శాఖ అప్పగిస్తారన్న విషయంపై ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఏపీలోని బాబు మంత్రి వర్గంలో చాలా మంది సీనియర్లు మంత్రులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందుకనే లోకేష్ కు బాబు ఎలాంటి శాఖను అప్పగిస్తారన్నదానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు వద్దనే సాధారణ పరిపాలన, లా అండ్ జస్టిస్, ఇంధన- మౌలిక వసతులు, పెట్టుబడులు, పరిశ్రమలు-వాణిజ్యం, సినిమాటోగ్రఫీ, టూరిజం వంటి పోర్ట్ ఫోలియోలన్నీ ఉన్నాయి. ఇప్పుడు బాబు వీటిలో ఏదో ఒకటి లోకేష్ బాబుకు అప్పగిస్తారా? లేకా మరొకటి ఏదైనా మంచి శాఖను అప్పగిస్తారా? అన్న విషయంపై ఇంకా తర్జనబర్జనలు నడుస్తున్నాయి. ఏపీలో ఐటీ శాఖ గానీ, లేకా పరిశ్రమలు గానీ.. లేకపోతే రెండు శాఖలు గానీ లోకేష్ కి అప్పజెప్పవచ్చన్న ఊహాగానాలు పార్టీనేతల్లో సాగుతున్నాయి. ఏది ఏం జరిగినా బడ్జెట్ సమావేశాల్లోనే ఈ విషయంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొత్త మంత్రిపదవులు వీటికి సంబంధించి ఉగాదిలోపే క్యాబినెట్ విస్తరణ జరిపి ప్రమాణస్వీకారం కూడా పూర్తయ్యేలా చేయడానికి సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నాయి.  అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తెలంగాణలో ఐటీ, భారీ పరిశ్రమలు,మున్సిపల్ శాఖలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే కేటిఆర్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయాలు వంటపట్టించుకొని ముమ్మరంగా ప్రజలలో మిక్కిలి క్రేజ్ సంపాదించుకున్నారు. మరి లోకేష్ ను బాబు ఏం చేస్తాడో చూడాలి. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement