Advertisement

పవన్‌ని ప్రశ్నించడానికి సమయం ఉంది!


పవన్‌ ప్రతి దానిని ప్రశ్నిస్తున్నాడు. ఇది శుభపరిణామం. కానీ పవన్‌ చేసే తప్పులను ఎవరైనా ప్రశ్నిస్తే కూడా ఆయన ఓపిక పట్టాలి.. కావాలంటే కౌంటర్‌ ఇవ్వాలే గానీ అసహనం వ్యక్తం చేయకూడదు. ఆయన అభిమానులు కూడా ఇదే పద్దతి ఫాలో కావాలి. అప్పుడే నిజమైన అభిమానులం అనిపించుకుంటారు. ఇప్పటివరకు పవన్‌ కుల, మతాలకు అతీతంగా, అధికార ప్రతిపక్షాలనే తేడా లేకుండా ధైర్యంగా ముందుకెళ్తున్నాడు. కాగా జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు ఆ పార్టీ వెబ్‌సైట్‌ని ప్రారంభించనున్నట్లు తెలిపాడు. కేవలం తనకు తెలిసిన సమస్యలనే కాకుండా, ఇతర అంశాలపై కూడా ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరుతున్నాడు. దీనికి సోషల్‌ మీడియాను సరిగ్గా ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. రాబోయే ఎన్నికల్లో మేనిపెస్టోను తమ స్వంత ఆలోచనలతో నింపమని, ప్రజలు లేవనెత్తే సమస్యలనే తమ మేనిఫెస్టోలు చేరుస్తామని కూడా హామీ ఇస్తున్నాడు. ఇది మంచి పరిణామం. ప్రజల అభిప్రాయాలను, మనోభావాలనే మేనిఫెస్టోలో పెట్టడం మంచి పని. 2019 కోసం ఆయన ఇప్పటి నుంచే కసరత్తులు చేయడం ఆయన ముందుచూపుకు నిదర్శనం. ఇక ముద్రగడతో పాటు అందరినీ దూరంగా పెట్టి, కులమత వర్గ బేధాలు లేకుండా ఆయన వ్యవహరించాల్సివుంది. అందరివాడుగా మారాలి. కేవలం ఆయన తన అభిమానుల వల్లనో, లేదా ఒక కులం కోసమో ప్రయత్నిస్తే వీలుకాదు. ఆయన గెలవాలంటే కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ఆదరణ పొందాలి. ఆయనకు అభిమానులంటే విపరీతమైన ప్రేమ. కానీ అభిమానుల్లో కూడా విపరీతధోరణులు కలిగిన వారిని ఆయన దూరం పెట్టాలి. అందరు హీరోల అభిమానుల ఆదరణను చూరగొనాలి. లేకపోతే ఆయన కూడా మరో చిరంజీవిలా, జెపిలా నామమాత్రంగా మిగిలిపోతాడు. ఆయనకు అధికారం ముఖ్యం కాకపోవచ్చు. కానీ అధికారంలోకి వస్తేనే ఆయన తాను అనుకున్నవి చేయగలడు. కాబట్టి అధికారం వద్దనుకుంటే వీలుకాదు. రాజ్యాధికారం సంపాదించాలి. కేజ్రీవాల్‌లా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి. ఇక పవన్‌ని ప్రశంసిస్తుంటే కొందరు విమర్శించడం ఖాయం. కానీ ప్రస్తుతానికైతే పవన్‌ ఆలోచనలు, భావాలు బాగున్నాయి. అవి గాడి తప్పినరోజున ఆయన్ను కూడా ప్రశ్నించాల్సివస్తుంది. కాబట్టి ఆయన ఫ్యాన్స్‌ సైతం బ్రాడ్‌మైండ్‌తో ఉండాల్సివుంది...!

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement