Advertisement

రానా లో మ్యాటర్ గుర్తించండి..!


ప్రభాస్‌ అభిమానులు 'బాహుబలి' విషయంతో తమ హీరోకు దేశవ్యాప్తంగా వస్తున్న కీర్తిని చూసి ఆనందపడుతున్నారు. కానీ రానా విషయంలో కొన్ని విమర్శలు చేస్తున్నారు. 'బాహుబలి' విజయం క్రెడిట్‌ మొత్తం ప్రభాస్‌ది కాదు. ఇది ఒక టీంవర్క్‌. ఒక్క 'బాహుబలి' అనే కాదు.. ఏ చిత్రమైనా టీం వర్క్‌పైనే ఆధారపడి ఉంటుంది. కానీ ఈ క్రెడిట్‌లో అన్ని శాఖలను శ్రమింపజేస్తూ, తాననుకున్న అవుట్‌పుట్‌ రాబట్టగలిగేది ముఖ్యంగా దర్శకుడే. ఈ విషయం ఎవరైనా ఒప్పుకుంటారు. రామ్‌చరణ్‌ నటించిన 'మగధీర'లో కూడా చరణ్‌ కంటే రాజమౌళి, అంత పెట్టుబడి పెట్టి చిత్రాన్ని తీసిన అల్లుఅరవింద్‌ గట్స్‌ను మెచ్చుకోవాలి. ఇక 'బాహుబలి' చిత్రంలో ప్రభాస్‌ కంటే రానా విలనిజాన్ని బాగా పండించాడనేది వాస్తవం. ప్రభాస్‌ లాగానే రానా కూడా వారసుడే. ఒక విధంగా చెప్పాలంటే కృష్ణంరాజుకు ఉన్న పరిచయాలు, పలుకుబడి కన్నా రామానాయుడు, సురేష్‌బాబులకు ఉన్న పలుకుబడి ఎక్కువ. ప్రభాస్‌ తన మొదటి చిత్రాలైన 'ఈశ్వర్‌, రాఘవేంద్ర' వంటి చిత్రాలలో మెప్పించలేకపోయిన ఆయన హీరోగానే చిత్రాలు చేశాడు. తన స్వయంకృషితో తనలోని లోటుపాట్లను అధిగమించాడు. నేడు డ్రీమ్‌బోయ్‌గా, హీమన్‌గా ఎదిగాడు. అది నిజం. కానీ రానాకి మాత్రం సురేష్‌బాబు స్వేచ్చనిచ్చాడు. కేవలం హీరోగానే కాకుండా తన ప్రతిభను నిరూపించుకునే ఫ్రీడం ఇచ్చాడు. అంతేగానీ కేవలం హీరోగానే చేయి.. అని తనకు ఆర్థిక స్తోమత ఉన్నా కూడా వరుసగా రానాతో చిత్రాలు తీయలేదు. అదే సమయంలో అందం, అభినయం నుంచి ఆజానుభాహునిగా, కండల వీరునిగా రానాకు కూడా ప్రభాస్‌తో సరిపడ్డా పోలికలు ఉన్నాయి. కానీ రానా కేవలం హీరోగానే ఫిక్స్‌ కాకుండా గెస్ట్‌రోల్స్‌ నుంచి విలన్‌గా, సపోర్టింగ్‌ క్యారెక్టర్‌గా, స్నేహం కోసం ఇప్పటికే దాదాపు అరడజనుకు పైగా చిత్రాలలో అతిధి పాత్రలు చేశాడు. అమితాబ్‌ నుంచి అజిత్‌ వరకు, వెంకటేష్‌ నుంచి ప్రభాస్‌ వరకు అందరితో కలిసి నటిస్తున్నాడు. ఆయన ఒక ఇమేజ్‌ ఛట్రంలో ఇరుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. నటనలో రాటుదేరుతున్నాడు. 'ఘాజీ'తో మరో సాహసం చేశాడు. త్వరలో ధనుష్‌తో గౌతమ్‌మీనన్‌ చేసే చిత్రంలో ఓ పాత్రను పోషిస్తున్నాడు. ఇమేజ్‌లకు దూరంగా ఉండాలని, తనపై ఓ ముద్రపడకుండా చూసుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం తేజతో మరోసారి సోలోహీరోగా నటిస్తున్నాడు. కాబట్టి ఫ్యాన్‌ అయిన వారు ప్రభాస్‌ని పొగడండి. అంతేగానీ డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌గా నిలబడుతున్న రానాను, అందుకు తనవంతు సహకారం అందిస్తున్న సురేష్‌బాబును, బాబాయ్‌ వెంకటేష్‌లను మనం అభినందించాలే గానీ విమర్శించకూడదు.

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement