Advertisement

బన్నీ చిత్రంపై అల్లు అరవింద్ మైండ్‌ గేమ్‌..!


ప్రస్తుతం అల్లు అర్జున్‌.. దిల్‌రాజు నిర్మాణంలో హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో 'డిజె' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మేలో రిలీజ్‌ చేయనున్నారు. కాగా బన్నీ ఇప్పటివరకు ముగ్గురు దర్శకులకు ఓకే చెప్పాడు. ఒకటి విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం, లింగుస్వామి దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం, తనకు 'రేసుగుర్రం' వంటి హిట్‌ స్టోరీని అందించిన వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేస్తూ 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' అనే చిత్రం. ఇక లింగుస్వామితో బన్నీ చేయల్సిన ద్విభాషా చిత్రం ఓపెనింగ్‌ కూడా చెన్నైలో జరిగింది. దీనిలో స్వయంగా బన్నీ పాల్గొన్నాడు. కోలీవుడ్‌ సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని తెలుగులో అల్లుఅరవింద్‌, తమిళంలో స్టూడియో గ్రీన్‌ అధినేత జ్ఞానవేల్‌రాజాలు నిర్మించాల్సి వుంది. తెలుగులో అల్లు అరవింద్‌కి ఈ చిత్రం బాగానే వర్కౌట్‌ అవుతుంది. కానీ తమిళంలోకి వచ్చే సరికి బన్నీకి అక్కడ ఎలాంటి క్రేజ్‌లేదు. దాంతో ఈ చిత్రానికి తమిళంలో పూర్తి బడ్జెట్‌ను పెట్టడానికి మొదటి నుంచి జ్ఞానవేల్‌రాజా సుముఖంగా లేడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మొదట్లో తమిళంలో కూడా పెట్టుబడిని తానే పెడతానని అల్లుఅరవింద్‌.. జ్ఞానవేల్‌ రాజాకు మాట ఇచ్చాడు. కేవలం ఆయన బేనర్‌ పేరును మాత్రమే వాడుకుంటానని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆ అనుబంధంతోనే జ్ఞానవేల్‌రాజా, సూర్యలు గీతాఆర్ట్స్‌లో వచ్చిన 'ధృవ' కోసం తమ 'ఎస్‌3' చిత్రం విడుదలను కూడా వాయిదా వేసుకొని ఆ తర్వాత చాలా నష్టపోయారు. ఇంత చేసినా కూడా అల్లు వారు తన మైండ్‌ గేమ్‌తో తమిళంలో పూర్తి బడ్జెట్‌ను తాను పెట్టనని, సగం జ్ఞానవేల్‌రాజాను భరించాలని కండీషన్‌ పెట్టాడట. దాంతోనే లింగుస్వామి చిత్రం హోల్డ్‌లో పెట్టారు. కానీ మీడియాకు మాత్రం నిర్మాతలకు, దర్శకుడికి అభిప్రాయభేదాలు వచ్చాయని లీక్‌ చేశారు. కానీ అసలు విషయం అది కాదని, అల్లుకి, జ్ఞానవేల్‌కి అండర్‌స్టాండింగ్ లేకపోవడమే ఈ చిత్రాన్ని హోల్డ్‌లో పెట్టడానికి కారణంగా తెలుస్తోంది. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement