Advertisement

'ఖైదీ' విషయంలో చేతులెత్తేసిని రాంచరణ్‌..!


చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక 150 వ చిత్రం 'ఖైదీనెంబర్‌150' చిత్రం 100కోట్లు కలెక్ట్‌ చేసిందని అల్లు అరవింద్‌, వినాయక్‌లు కలిసి ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ప్రకటించారు. తమ సినిమా 150కోట్లకు పైగా వసూలు చేసిందని మెగాఫ్యామిలీ వారు జబ్బలు చరుచుకున్నారు. కానీ తాజాగా ఈ చిత్రం అంత కలెక్ట్‌ చేయలేదని స్వయాన నిర్మాత రాంచరణ్‌ ఒప్పుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి' నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్లను ఇప్పటికే టార్టెట్‌ చేసిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు ఇప్పుడు రామచరణ్‌ను టార్గెట్‌ చేశారు. ఇందులో భాగంగా తమ చిత్రం 100కోట్ల గ్రాస్‌నైతే సాధించింది గానీ 100కోట్ల షేర్‌ను మాత్రం వసూలు చేయలేదని రాంచరణ్‌ తెలిపాడట. తమ చిత్రం కేవలం 75కోట్ల షేర్‌ను వసులు చేసిందని ఆయన ఒప్పుకున్నాడట.

Advertisement

ఇక ఈ చిత్రంలో పనిచేసినందుకు చిరుకు 20కోట్లు, దర్శకుడు వినాయక్‌కు 10కోట్లు రెమ్యూనరేషన్‌గా ఇచ్చినట్లు, తమ చిత్రానికి మొత్తం 60కోట్లు ఖర్చయితే ఓ 15కోట్లు లాభం మాత్రమే వచ్చిందని చరణ్‌ లెక్కలతో సహా ఇన్‌కమ్‌టాక్స్‌ అధికారులకు చూపించాడట. అన్ని ఏరియాల నుంచి ఎగ్జిబిటర్ల కల్షెన్‌ చార్ట్‌ల కోసం తాను ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపాడట. ఇక ఈ చిత్రాన్ని తాను ఎవ్వరికీ అమ్మలేదని, తానే స్వయంగా రిలీజ్‌ చేసుకున్నానని, ఎలాంటి బిజినెస్‌డీల్స్‌ కూడా లేవని చరణ్‌ చెప్పాడని తెలుస్తోంది. ఇక అల్లు అరవింద్‌, వినాయక్‌లు ప్రెస్‌మీట్‌ పెట్టి తమ చిత్రం మొదటి వారంలోనే 100కోట్లు సాధించిందని ప్రకటించారు కదా...! అని అధికారులు చరణ్‌ను ప్రశ్నించినప్పుడు అదంతా పబ్లిసిటీ కోసమేనని, కానీ నిర్మాతనైన తాను ఆ ప్రెస్‌మీట్‌ను పెట్టలేదని సెలవిచ్చాడట. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement