Advertisement

ఈ సీక్వెల్స్‌ లో విజయం సాధించేదెవరు..?


ఒప్పుడు హాలీవుడ్‌, బాలీవుడ్‌లకే పరిమితమైన సీక్వెల్స్‌ ట్రెండ్‌ ఇప్పుడు టాలీవుడ్‌, కోలీవుడ్‌లకు కూడా పాకింది. చిరు నటించిన 'శంకర్‌దాదా' సిరీస్‌తో పాటు పవన్‌ నటించిన 'గబ్బర్‌సింగ్‌' సిరీస్‌లు కూడా రెండు సినిమాలలో ఒకటి మాత్రమే హిట్‌గా నిలిచి రెండోవది నిరాశపరిచింది. ఇక తెలుగులో 'బాహుబలి'తో రాజమౌళి ఈ సంచలనానికి మరలా కేంద్ర బిందువయ్యాడు. 'బాహుబలి1' దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఆయన అంత కంటే గ్రాండియర్‌గా 'బాహుబలి2'ను తీర్చిదిద్దుతున్నాడు. ఇక 'రోబో' చిత్రంతో సంచలనం సృష్టించిన శంకర్‌ సైతం దానికి సీక్వెల్‌గా '2.0'ని ఇండియాలోనే హయ్యస్ట్‌ బడ్జెట్‌ ఫిలింగా తెరకెక్కిస్తున్నాడు. 

Advertisement

ఈ రెండు చిత్రాలపై దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలున్నాయి. ఇక తెలుగులో ఓంకార్‌ దర్శకత్వంలో చిన్న చిత్రంగా వచ్చిన మంచి విజయం సాధించిన 'రాజుగారి గది'కి సీక్వెల్‌గా రూపొందుతున్న 'రాజుగారి గది2'లో నాగార్జున, సమంతలు నటించనుండటం, ఇది నాగ్‌ చేసే మరో డిఫరెంట్‌ మూవీగా ప్రచారం జరుగుతోంది. ఇక చిన్న చిత్రంగా వచ్చి మంచి కలెక్షన్లను, విమర్శలను ఎదుర్కొన్న 'గుంటూర్‌టాకీస్‌'కి కూడా సీక్వెల్‌ రూపొందుతోంది. ఇందులో సన్నిలియోన్‌, నమితలతోపాటు కొందరు సెక్స్‌బాంబ్స్‌ నటిస్తుండటంతో దీని కోసం యువత ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వంశీ దర్శకత్వంలో వచ్చి సంచలన విజయం సాధించిన 'లేడీస్‌టైలర్‌' చిత్రం రాజేంద్రప్రసాద్‌ కెరీర్‌నే మలుపుతిప్పింది. దానికి సీక్వెల్‌గా ప్రస్తుతం సుమంత్‌ అశ్విన్‌ హీరోగా 'సన్నాఫ్‌ లేడీస్‌టైలర్‌' చిత్రం రూపొందుతోంది. ఇక కమల్‌ నటించిన స్పైథ్రిల్లర్‌ 'విశ్వరూపం'కు సీక్వెల్‌గా తీసిన 'విశ్వరూపం2' కూడా ఇదే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. రజనీ నటించిన 'కబాలి'కి, ధనుష్‌ నటించిన 'విఐపి' చిత్రాలకు కూడా సీక్వెల్స్‌ రూపొందుతున్నాయి. వీటిలో ఎక్కువ భాగం చిత్రాలు ఇదే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఇవైనా దక్షిణాదిలో సీక్వెల్స్‌కు మరలా ఊపునిస్తాయో? లేదో? చూడాలి. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement