Advertisement

చిన్నబుచ్చాలని చూస్తే ఊరుకోనని ఫైర్ అయ్యాడు!


డైరెక్టర్ క్రిష్ తాజా చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కలక్షన్స్ వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏదైనా సినిమా విడుదలైనప్పుడు ఆ సినిమా పట్ల రకరకాల అభిప్రయాలను వ్యక్తం చేస్తుంటారు క్రిటిక్స్. ఇక క్రిటిక్స్ తోపాటు ఎవరి మనోభావాలైన దెబ్బతిన్నప్పుడు వారూ కొంచెం గట్టిగానే ఆ సినిమా తీసిన వ్యక్తులపై ఫైర్ అవుతుంటారు. ఇక ఇప్పుడు 'గౌతమీపుత్ర శాతకర్ణి' గురించి కూడా కొంతమంది నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. క్రిష్ చరిత్రని వక్రీకరించి 'గౌతమీపుత్ర...'  సినిమా తీసాడని కొంతమంది పనిగట్టుకుని విమర్శించడం మొదలుపెట్టారు. 

Advertisement

ఇక ఈ అర్ధంపర్ధం లేని వ్యాఖ్యలను డైరెక్టర్ క్రిష్ తిప్పికొట్టాడు. తాను ఎంతో కష్టపడి... ఇష్టపడి 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని తెరకెక్కించానని.... దాన్ని చిన్నబుచ్చాలని చూస్తే ఊరుకోనని ఫైర్ అయ్యాడు. ఎంతోమంది సలహాలు తీసుకుని... ఎనో పుస్తకాలు తిరగేసిన తర్వాతే ఈ సినిమా కథను రాసుకున్నామని... సినిమాలో ఎదో కొద్దిగా మాత్రమే కల్పితమని..... మిగిలినది మొత్తం నిజాలనే 'గౌతమిపుత్ర...'లో చూపించానని మండిపడుతున్నాడు.

అసలు బాలయ్య తండ్రి ఎన్టీఆర్ ఈ 'గౌతమీపుత్ర శాతకర్ణి' ని చేయాలనుకున్నారు.... 'గౌతమీపుత్ర శాతకర్ణి' తెలుగువాడు కాకపొతే ఆయన అసలు ఆ సినిమా చెయ్యాలనుకుంటారా.. అని విమర్శకులని ఏకిపారేశాడు. ఇంకా నేను చిన్నప్పుడు చదివిన కథల ఆధారంగా కొన్ని అంశాలను ఈ కథలో చేర్చి ఈ కథను తెరకెక్కించానని అంటున్నాడు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement