Advertisement

మీడియాని పొగుడుతూనే..తిడుతున్నాడు!


మీడియాలో మరీ ముఖ్యంగా సోషల్‌మీడియాలో మంచి రేటింగ్స్‌ ఇస్తే పొగుడుతారు. తక్కువ ఇస్తే మండిపడతారు. ఇది సినిమా ఫీల్డ్‌లో నేడున్న పోకడ. మీడియా ని గతంలో చాలా చులకన చేసి మాట్లాడిన చరణ్... 'ధృవ' చిత్రానికి మంచి రేటింగ్స్‌ రావడం, దాని ఎఫెక్ట్‌ వల్ల ఓవర్‌సీస్‌లో తొలిసారిగా మిలియన్‌ మార్క్‌ను దాటిన ఆనందంలో ఆయన ఇటీవలే మీడియాను ప్రశంసల్లో ముంచెత్తాడు. ఇదే కోవలోకి చాలా మంది, చివరికి శివాజీ, సప్తగిరి వంటి వారు కూడా వచ్చి చేరుతున్న సంగతి తెలిసిందే. కాగా కమెడియన్‌ అయిన సప్తగిరి హీరోగా మారి తాను చేసిన 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' చిత్రం ఇటీవలే విడుదలై, పెద్దగా మార్కులు కొట్టేయలేకపోయింది. కానీ పవన్‌ కళ్యాన్‌ ఈ ఆడియోకు రావడం, సప్తగిరిని మెచ్చుకోవడంతో ఆయన అభిమానుల పుణ్యమా అని ఓ మోస్తరు కలెక్షన్లనే రాబట్టింది. ఈ చిత్రం తొలిరోజు దాదాపు 2.5కోట్ల కలెక్షన్లను సాధించినట్లు నిర్మాత రవికిరణ్‌ ప్రకటించాడు. ఇది నిజమేనా? అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తమ చిత్రానికి బి,సి సెంటర్లలో మంచి ఆదరణ లభిస్తోందని, అందుకే ఈ చిత్రానికి విజయయాత్ర నిర్వహిస్తున్నామని హీరో, నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ సందర్భంగా సప్తగిరి కంటతడి పెట్టుకొని, కొందరు తనపై వ్యక్తిగతంగా ద్వేషం పెంచుకొని, రివ్యూలలో ఏదేదో రాశారన్నాడు. తనను, తన కుటుంబాన్ని బాధిస్తే, వారికెందుకంత ఆనందం అంటూ సెటైర్లు వేశాడు. 

Advertisement

మరోపక్క మీడియా బాగా సపోర్ట్‌ ఇచ్చిందని, తమ చిత్రానికి నెగటివ్‌ రివ్యూలు వచ్చినా కూడా బి,సి సెంటర్ల ఆడియన్స్‌ తమకు అండగా నిలబడ్డారని చెప్పుకొచ్చాడు. పనిలో పనిగా ఈ చిత్ర నిర్మాత తెలంగాణకు చెందిన వాడైనప్పటికీ తాను ఈ చిత్రం చేసి, ఓ మంచి నిర్మాతను పరిచయం చేశానన్నాడు. మధ్యలో ఈ తెలంగాణ, ఆంధ్రా ఫీలింగ్‌ ఏమిటో ఎవ్వరికి అర్దం కావడం లేదు. ఇక తనతో ఈ చిత్ర నిర్మాత హీరోగా సినిమా చేయడమే గొప్పని, అందుకే ఈ చిత్రానికి పదిపైసలు రెమ్యూనరేషన్‌ కూడా తీసుకోకుండా, నిర్మాణంపైనే ఖర్చుపెట్టమని చెప్పానన్నాడు. ఈ చిత్రాన్ని తమిళం నుంచి తెలుగులోకి మార్చే క్రమంలో తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా పలు మార్పులు చేర్పులు చేసి, అడిషనల్‌ స్క్రీన్‌ప్లే క్రెడిట్‌ కొట్టేశాడని ఆయన్ను పలువురు అభినందనల్లో ముంచెత్తారు. మొత్తానికి ఈ విషయాలన్నీ చూస్తున్న వారికి ఎంతో సినిమాటిక్‌గా అనిపించడం జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement