Advertisement

రాజశేఖర్‌కి అంత సీనుందా..?


జీవిత రాజశేఖర్‌... రాజకీయాల్లో స్థిరపడాలని ఎన్నో ఏళ్లుగా కలలు కంటోంది. ఆయా రాం... గయా రాం టైప్‌లో అన్ని పార్టీలలో చేరుతూ, ఎక్కడా తనకు పెద్దపీట వేయకపోవడం ఆమెకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. కోట, బాబూమోహన్‌, రోజా వంటి వారు కూడా నేతలుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేగా ఎదిగిన వైనం చూసిన ఆమెకు ఇప్పటికీ పాలిటిక్స్‌పై ఆశచావలేదు. ఇప్పటికే అన్ని పార్టీలను చుట్టివచ్చిన ఆమె తనకు ఏ పార్టీ కాస్తైనా లిఫ్ట్‌ ఇస్తుందేమో? అని కలలు కంటోంది. కాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, తద్వారా రోజాలా తాను వార్తల్లో నిలవాలని తెగ ఇదైపోతోంది. తాజాగా ఆమె చిలక జోస్యం కూడా నేర్చుకున్నట్లు ఉందని, తానో అనుభవజ్ఞురాలైన రాజకీయ నాయకురాలిని అనే భ్రమలో ఉన్నట్లు ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్‌ చూస్తే అనిపించకమానది మెగాభిమానులతో పాటు వైయస్సార్‌సీపీ సానుభూతిపరులు అంటున్నారు. 

Advertisement

ఈ ఇంటర్వ్యూలో ఆమె పవన్‌కళ్యాణ్‌ గురించి, జగన్‌ గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్‌ చేసింది. 'జనసేన'లో చేరే ఉద్దేశ్యం ఉందా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. పవన్‌ మంచి నటుడే గానీ ఆయన పెద్ద రాజకీయనాయకుడు కాదని, ఆయన ఇంకా స్ట్రాంగ్‌గా లేడంది. అంతేకాకుండా చిరుపై సెటైర్‌ వేస్తున్న తరహాలో ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం చాలామంది అనేక సొంత పార్టీలుపెడుతూ, తర్వాత ఇతర పార్టీలలో వాటిని విలీనం చేస్తున్నారని, పవన్‌ అలా చేయకుండా ఉంటే బాగుంటుందని ఓ అనుభవజ్ఞురాలైన రాజకీయ విశ్లేషకులరాలిగా ఓ సలహా కూడా ఇచ్చింది. ఇందులో కూడా కాస్త వాస్తవమే ఉంది. ఇక జగన్‌ విషయంలో ఆమె చెప్పిన మాటలు వింటే నవ్వురాకమానదు. జగన్‌ వ్యవహారాశైలి నచ్చక ఆయన పార్టీ పెట్టకముందే ఆయన నుంచి దూరంగా వచ్చేశామని చెప్పింది. 

ఇంత వరకు ఓకే గానీ, ఆమె ఇంకా మాట్లాడుతూ, రాజశేఖర్‌కు ఉన్న క్రేజ్‌ను చూసి జగన్‌ తట్టుకోలేకపోయాడని చెప్పింది. రాజశేఖర్‌ రాజకీయాల్లోకి వస్తే తనను మించిపోతాడేమో అనే అభద్రతా భావానికి జగన్‌ లోనయ్యాడని, అందుకే తనను మాత్రమే రాజకీయాల్లోకి రావాలి.. రాజశేఖర్‌ను మాత్రం సినిమా ఫీల్డ్‌లోనే ఉండమనడంతో తమకు కోపం వచ్చిందని చెప్పింది. అంతేనా.. జగన్‌ అరెస్ట్‌ కావడంలో తప్పులేదని, ఆయన అవినీతిపరుడని తాము నమ్ముతున్నామని తెలిపింది. మరోపక్క ప్రస్తుతం తామున్న బిజెపిలో కూడా తనకు ప్రాధాన్యత లభించడం లేదని భావిస్తున్నట్లు ఉంది. అందుకే పెద్దనోట్ల రద్దు విషయంపై స్పందిస్తూ.. నితిన్‌గడ్కరీ, గాలిజనార్ధన్‌రెడ్డి వంటి బిజెపి నేతలు అంత ఖర్చులుపెట్టి పెళ్లిళ్లు ఎలా చేశారు? అంటూ విమర్శలు చేసింది. అయితే ఈ విషయంలో కూడా ఆమె ఆరోపణలు వాస్తవమేనని ఒప్పుకోవచ్చు. అయినా ఇక్కడ అందరికీ నవ్వు తెప్పిస్తున్న విషయం ఏమైనా ఉందంటే అది జగన్‌ తన భర్త రాజశేఖర్‌కు ఉన్న క్రేజ్‌ను ఓర్వలేకపోయాడని చెప్పడమే అని చెప్పవచ్చంటున్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement