Advertisement

రజినీ ఎలా గట్టెక్కుతారో చూద్దాం..!


మోడీ పెద్ద నోట్ల రద్దుతో దేశం మొత్తం మీద సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఏటీఎంల వద్ద, బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఇక బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సినిమా స్టార్స్ దగ్గరనుండి మోడీ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నప్పటికీ లోలోపల మధన పడుతూనే వున్నారు. ఇక మధ్యతరగతి ప్రజలు మాత్రమే డబ్బులు కోసం కష్టపడటం లేదని... ఇంకా పెద్ద పెద్ద వారు కూడా డబ్బు కోసం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని అంటున్నారు. పెద్ద కుటుంబాల మీద కూడా మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఎఫెక్ట్ పడిందట.

Advertisement

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కుటుంబం కూడా ఈ పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఇబ్బందులు పడుతుందట. రజినీ భార్య లతా రజినీకాంత్ చెన్నై లో ఒక స్వచ్ఛంద ఆశ్రమ పాఠశాల నడుపుతుంది. ఆ పాఠశాలలో పని చేసున్న పనివారికి, డ్రైవర్స్ కి నెలవారీ జీతాలు ఇవ్వడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందట. నోట్ల రద్దు వలన వారికీ వేతనాలు చెల్లించడానికి లతా రజినీకాంత్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట. దీనితో తమకు వేతనాలు సకాలంలో చెల్లించాలని డ్రైవర్స్ పనివారు ధర్నాలు చేపడుతూ రోడ్డెక్కారట.

అసలెప్పుడూ తమకి నెలాఖరుకల్లా జీతాలు వచ్చేవని... మోడీ నిర్ణయం వల్ల తాము నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అయితే బ్యాంకులకు వరుస సెలవలు రావడం వల్ల, జయలలిత మరణం వల్ల, చెన్నై వార్ధా తుఫాను వల్ల జీతాలు సకాలంలో చెల్లించలేక పోయామని మేనేజ్మెంట్ చెబుతోందట. అయితే వారు మాత్రం సూపర్ స్టార్ ని ప్రశ్నించడానికి సైతం సిద్హమని చెబుతున్నారట. మరి నిర్ణయాన్ని ట్విట్టర్ లో పొగిడిన రజినీ ఈ సమస్య నుండి ఎలా గట్టెక్కుతారో చూద్దాం.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement