Advertisement

'ధృవ' విలన్ కు భారీ ఆఫర్స్..!


దాదాపు రెండు దశాబ్దాల కింద తమిళ, మలయాళ, తెలుగు,హిందీ పరిశ్రమల్లో డ్రీమ్‌బాయ్‌గా వెలుగొందిన రొమాంటిక్‌ నటుడు అరవింద్‌స్వామి. ఆయనకు 'రోజా, ముంబై' వంటి చిత్రాలతో పెద్ద క్రేజ్‌ వచ్చి, చివరకు అతిలోక సుందరి శ్రీదేవి చేత కూడా అందగాడు అంటే స్వామిలా ఉండాలనే కాంప్లిమెంట్‌ను ఆయన అందుకున్నాడు. నేటితరంలో టాలీవుడ్‌లో మహేష్‌కు అమ్మాయిలలో ఎంతటి క్రేజ్‌ ఉందో నిన్నటితరంలో స్వామికి 'రాజకుమరుడు' గా అంత పేరు ఉంది. ఆయన మంచి పీక్‌ స్టేజీలో ఉందగానే వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకొని, అందరినీ నిరాశపరిచాడు. కాగా మణిరత్నం 'కడలి' చిత్రంతో రీఎంట్రీ ఇచ్చినప్పటికీ అది ఆయన కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. కానీ తమిళ 'తనిఒరువన్‌'లో ఆయన పోషించిన విలన్‌ పాత్ర ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అయినా కూడా తమిళంలో ఆయనకు మరలా రెండు మూడు చిత్రాలలో తప్పితే పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ ఈ చిత్రం తెలుగు రీమేక్‌ 'ధృవ' లో సిద్దార్ద్‌ అభిమన్యుగా ఆయన చేసిన నెగటివ్‌ రోల్‌తో ఆయనకు పెద్ద బ్రేక్‌ వచ్చింది. ఈ చిత్రంలో తన అనుభవాన్నంతా రంగరించి, చిన్న చిన్న సీన్స్‌లో కూడా ఆయన పలికించిన హావభావాలు అదరగొట్టాయి. ఈ చిత్రంలో చరణ్‌ కంటే స్వామికే ఎక్కువ పేరు లభిస్తోంది. దీంతో ఆయనకు తెలుగులో 'ధృవ' చిత్రం రిలీజ్‌ అయిన నాలుగు రోజుల లోపే దాదాపు 15 తెలుగు చిత్రాలలో అవకాశాలు వచ్చాయట. కానీ ఆచితూచి అడుగేస్తున్న ఆయన ఇప్పటివరకు కేవలం మూడు చిత్రాలకు మాత్రమే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడట. ఇవన్నీ నెగటివ్‌ రోల్సే కావడం విశేషం. ఇక బాలీవుడ్‌లో కూడా త్వరలో ఆయన డ్రీమ్‌ డాడీగా కనిపించనున్నాడు. ఓ కొత్త దర్శకుని డైరెక్షన్‌లో రూపొందుతున్న 'డియర్‌ డాడ్‌' చిత్రంలో ఆయన 14ఏళ్ల పిల్లాడికి తండ్రిగా కనిపించనున్నాడు. మొత్తానికి స్వామి కెరీర్‌కు 'ధృవ' చిత్రం బాగా ప్లస్‌ అయిందని ఒప్పుకోవాల్సిందే. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement