Advertisement

రహస్యంగా ప్లాన్‌ చేసుకున్న స్టార్‌..!


బాలీవుడ్‌ స్టార్‌హీరో హృతిక్‌రోషన్‌ తాజాగా విదేశాలలో రిలాక్స్‌ అవ్వడానికి వెళ్లాడు. ఇది పెద్ద సంగతేం కాదు. కానీ ఈసారి తన వెంట ఆయన తన తాజా గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకెళ్లాడు. గతంలో ఆయన పలువురితో ఇలాగే పలు రిలాక్సింగ్‌ టూర్లకు వెళ్లివున్నాడు. కానీ అవన్నీ ఆయన బహిరంగంగానే ప్లాన్‌ చేశాడు. ఆయా న్యూస్‌లు బాలీవుడ్‌లో పెద్ద విశేషంగా మారి, మీడియాలో కూడా ఫొటోలతో కూడా బయటకు వచ్చాయి. ఇంతకాలం తాను నమ్మిన స్నేహితులతో కలిసి ఆయన ఇలా టూర్లకు వెళ్లివచ్చాడు. తాజాగా ఆయన నవంబర్‌28న విదేశాలకు వెళ్లాడు. ఈ టూర్‌ను మాత్రం తాను నమ్మిన స్నేహితుల వద్ద కూడా రహస్యంగానే ఉంచాడు. దీంతో ఆయన తనతో టూర్‌కు తీసుకెళ్లిన తాజా గర్ల్‌ఫ్రెండ్‌ సినిమా రంగానికి చెందిన అమ్మాయే అని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం ఆమె ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త కూతురనే ప్రచారం సాగుతోంది. ఈ టూర్‌ విషయాన్ని రహస్యంగా ఉంచాలని ఆయన తాజా గర్ల్‌ఫ్రెండ్‌ గట్టిగా ముందుగానే హెచ్చరించడంతో హృతిక్‌ ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచాడు. 

Advertisement

ఇక హృతిక్‌ కెరీర్‌ విషయానికి వస్తే ఆయన గత చిత్రం 'మొహంజదారో' డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆయన 'కాబిల్‌' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని రాకేష్‌ రోషన్‌ నిర్మిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో 'కహోనా ప్యార్‌హై, క్రిష్‌, క్రిష్‌3' కోయి మిల్‌గయా' చిత్రాలు వచ్చి ఘనవిజయం సాధించాయి. భారీ బడ్జెట్‌తో యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న తాజా 'కాబిల్‌' చిత్రంలో యామీగౌతమ్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, సంజయ్‌గుప్తా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జనవరి 26న విడుదల చేయనున్నారు. అదే రోజున బాలీవుడ్‌ కింగ్‌ఖాన్‌ షారుఖ్‌ఖాన్‌ నటిస్తున్న భారీ చిత్రం 'రాయిస్‌' కూడా విడుదల కానుండటంతో అందరిలో ఈ పోటీ ఆసక్తిని రేపుతోంది. 'కాబిల్‌'చిత్రాన్ని అదే రోజున తెలుగులో కూడా 'బలం' పేరుతో డబ్‌ చేసి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో హృతిక్‌ నటించిన 'క్రిష్‌, ధూమ్‌3' వంటి చిత్రాలు తెలుగులోకి అనువాదమైన సంగతి తెలిసిందే.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement