ఓహో అనుష్క… ఎంతటి సోయగాన్ని పంచావ్!!


బాలీవుడ్ అందాల భామ అనుష్క శర్మ రూటే సపరేటు. ఎప్పుటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటుంది అనుష్క శర్మ.  కొన్ని కొన్ని సార్లు సంచలనాలకు మారు పేరుగా కూడా నిలుస్తుంది. ఏ సినిమాలో అయినా ఆయా పాత్రలో అలా ఒదిగిపోయి... ఆయా పాత్రలను పండించడంలో అనుష్క శర్మ సక్సెస్ సాధిస్తుంది. అప్పుడప్పుడూ ఈ భామ హాట్ హాట్ గా పోజులు ఇవ్వడంలో కూడా తనకు తానే సాటి అని ఎన్నోసార్లు నిరూపించుకుంది కూడాను. మొన్నటి వరకు ఈ భామ, విరాట్ కోహ్లీతో ప్రేమాయణం సాగించి సంచలనం రేపింది. అందులో అంతర్జాతీయంగా ప్రజలందరినీ ఆకర్షించింది.  ఈ మధ్యనే ‘సుల్తాన్’ సినిమా ద్వారా వస్తాదులా  ప్రత్యర్థులందరినీ అణచివేసింది. ‘పీకే’ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో ఒదిగిపోయి మరీ చెలరేగిపోయింది. 'సుల్తాన్' సినిమా ద్వారానైతే తాను చాలా గ్లామర్ అండ్ సాఫ్ట్ అన్న విషయాన్ని చూపించింది.

తాజాగా అనుష్క శర్మ ఎల్లే అనే మ్యాగజైన్ కోసం ఘాటుగా.. హాట్ రేపే ఫోటో షూట్ లకు ఫోజులిచ్చి తన సోయగాన్ని చిమ్మింది. ఈ ఫొటోస్ చుసిన వారంతా అబ్బా… అనుష్క చంపేసింది అని అంటున్నారు.  ఎల్లో మేగజైన్ 20 సంతవ్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని నెలకొక స్పెషల్ ఎడిషన్ ను తెస్తుంది. అందులో భాగంగా జనవరి నుండి వస్తున్న ఈ స్పెషల్ లో ఇప్పటివరకు తొమ్మిది మంది ముద్దుగుమ్మలు ఈ కవర్ పేజీలో దర్శనమిచ్చారు. ఇప్పుడు అనుష్క వంతు వచ్చింది. అలా ఎప్పుడూ సింపుల్ గా కనిపించే అనుష్క ఒక్కసారిగా సెక్సీ క్వీన్  రూపంలో కూడా చాలా సింపుల్ గా ఫోజిచ్చిది. మెడలో అతి పెద్ద ఆభరణాన్ని ధరించి, తన శరీరం రంగులో ఉన్న టాప్ ను చుట్టుకొని, ఉలెన్ హ్యాండ్ ఎంబ్రాయిడెరీ కోట్ ను వేసుకొని అచ్చంగా స్వచ్ఛమైన రాణిలా సోయగాన్నివలికిస్తున్న అనుష్క అందాలను చూడతరమా అంటున్నారు అనుష్క అభిమానులు.  

Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES