Advertisement

ఎన్టీఆర్‌ హవా..ఇలా ఉంటది..!


ఎన్టీఆర్‌. మోహన్‌లాల్‌, సమంత, నిత్యామీనన్‌లు కీలకపాత్రల్లో నటించిన 'జనతాగ్యారేజ్‌' చిత్రం ఇప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద దాదాపు 75కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేసింది. ఇక మొత్తంగా ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.125కోట్లు వసూలు చేసిందని ట్రేడ్‌వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ చిత్రానికి కొరటాల శివ డైరెక్షన్‌ ఒక ప్లస్‌ పాయింట్‌ అయింది. కాగా ఈ చిత్రం తెలుగులో వచ్చిన టాప్‌ 3 హయ్యస్ట్‌ కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో మూడో స్దానాన్ని దక్కించుకుంది. మొదటిరోజున ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పటికే టాప్‌3లో అంటే 'బాహుబలి', 'శ్రీమంతుడు' చిత్రాల తర్వాత మెగా హీరోలైన పవన్‌కళ్యాణ్‌ నటించిన 'అత్తారింటికి దారేది, మగధీర' చిత్రాలను దాటుకొని మూడో స్దానంలో ఉంది. కాగా ఈచిత్రం ఇప్పటికీ మల్టిప్లెక్స్‌లలో 85శాతం కలెక్షన్లు సాధిస్తూ ఉంది. ఇదే హవా మరో వారం పాటు సాగితే ఈచిత్రం 'శ్రీమంతుడు'ని క్రాస్‌ చేసి రెండోస్దానం సాధించడం ఖాయమనిపిస్తోంది. ఈ రేంజ్‌లో ఎన్టీఆర్‌ హవా ఉంటుందని ఇప్పటికీ ట్రేడ్‌వర్గాలు ఆశ్యర్యపోతున్నాయి. మొత్తానికి ఈ రేంజ్‌లో ఎన్టీఆర్‌ సినిమా కలెక్షన్లు ఉంటాయని, సరైన సినిమా పడాలే గానీ ఎన్టీఆర్‌ ఈ రికార్డులను ఇట్టే కొట్టేయగలడని 'జనతా గ్యారేజ్' నిరూపించిందని అనుకుంటున్నారు. కాగా ఇటీవల విడుదలైన బన్నీ 'సరైనోడు' కూడా మొదటి షో నుంచే నెగటివ్‌ టాక్‌ వచ్చినప్పటికీ రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. కాగా 'జనతాగ్యారేజ్‌' చిత్రం దానిని మించి పోయింది. దీంతో ఈ చిత్రాల విజయాల పట్ల ప్రేక్షకుల ఆదరణను ఎలా ఉంటుందో తెలియక సినీ విశ్లేషకులు కూడా తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. కాగా 'సరైనోడు' తరహాలోనే 'జనతాగ్యారేజ్‌' కి కూడా ఏ సినిమా పోటీ లేకపోవడం, ఈ వారం విడుదలైన 'నిర్మలా కాన్వెంట్‌'తో పాటు వచ్చిన చిత్రాలు కనీసం ఫర్వాలేదు అనే స్దాయిలో లేకపోవడం 'జనతాగ్యారేజ్‌' కు కూడా వరంలా మారింది. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement