Advertisement

మోడీ వద్దకు మోసకెళ్ళిన నరసింహుడు


భారత ప్రధాని నరేంద్ర మోడీతో తెలుగు ఉభయరాష్ట్రాల గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించంపై ఆగ్రహజ్వాలలు రేగుతుండటంతో, దీనిపై రాష్ట్ర ప్రజల వెనుక గల అసలు రహస్యాన్ని ఈ సందర్భంగా మోడి, గవర్నర్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోడీకి, గవర్నర్ నివేదిక అందజేసినట్లు తెలుస్తుంది. ఇదే సందర్భంలో ఎన్‌డిఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై ప్రజల నుండి ఎలాంటి అభిప్రాయాలు వెలువడుతున్నాయో మోడీ గవర్నర్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేత ప్యాకేజీపై ప్రజలు ఏమనుకుంటున్నారు? హోదాకంటే ప్యాకేజీనే బెటర్ అనే దిశగా నాయకులు ప్రజలకు వివరిస్తున్నారా? లేదా? అన్న విషయాలను మోడీ గవర్నర్ ను అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తుంది. కాగా ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రకటించటంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయిన విషయం తెలిసిందే. నరసింహన్ తన నివేదిక ద్వారా ప్రజల నుండి వ్యక్తమయిన భిన్నాభిప్రాయాలతో పాటు దానికి కారణాలను కూడా  మోడీకి వివరించినట్లు తెలుస్తుంది. 

Advertisement

విభజన జరిగినప్పటి నుండి ప్రజల్లో బలంగా నాటుకుపోయిన ప్రత్యేక హోదా అంశాన్ని ప్రతిపార్టీ ప్రజల్లో క్యాష్ చేసుకోడానికి ఆయుధంగా ఉపయోగపడుతున్న వైనాన్ని గవర్నర్ వివరించినట్లు తెలుస్తుంది. అన్ని పార్టీలు కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం హోదా అంశాన్ని భావోద్రేకాలతో ముడిపెడుతున్నారన్న విషయంపై కూడా గవర్నర్ ఎక్కువగా సంభాషించినట్లు తెలుస్తుంది. ఈ అంశాలన్నింటినీ నివేదికలో పేర్కొన్నట్లు వెల్లడౌతుంది. కాగా ఇక్కడ ఎవరి స్వార్ధ ప్రయోజనాలు వారివి కదా. మోడీ దృష్టిని నరసింహన్ మరింతగా ఆకర్షించే నిమిత్తం ఏపీకి ప్రత్యేక హోదాకంటే ఇచ్చిన ప్యాకేజీ ద్వారా ఒనగూడే ప్రయోజనాలపై ప్రజలకు సమర్ధ నాయకులు ఇంకా స్పష్టపరచాల్సి ఉందని తెలిపినట్లు కూడా అర్ధమౌతున్న అంశం.  

 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement