Advertisement

ఎన్టీఆర్‌లో వచ్చిన మార్పేంటి...?


నవరసాలను అద్బుతంగా పలికించడంలో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ మేటి. ఆయన నవరసాలను అద్భుతంగా తెరపై చూపించగలడు. ఇక ఈయన చేస్తున్నగత మూడేళ్ల నుండి సినిమాలు తీసుకుంటే ఆయన కామెడీని మర్చిపోతున్నాడా? అనిపిస్తోంది. కామెడీలో ఎన్టీఆర్‌ ఎలాంటి సిద్దహస్తుడో 'అదుర్స్‌, బృందావనం, బాద్‌షా' చిత్రాలను చూస్తే తెలుస్తుంది. కానీ 'టెంపర్‌' నుంచి ఎన్టీఆర్‌ నటించిన చిత్రాల్లో కామెడీ మిస్‌ అవుతోంది. తన ఉగ్రరసాన్ని దాంతో పాటు వైవిధ్యభరితమైన కథలు చేస్తున్న ఎన్టీఆర్‌ చిత్రాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ మిస్సవుతోంది. 'టెంపర్‌'లో కూడా సిట్యూయేషన్‌ కామెడీనే కానీ కామెడీ ట్రాక్‌లు అసలు లేవు. ఇక 'నాన్నకు ప్రేమతో' చిత్రం ఓ వైవిధ్యభరితమైన చిత్రం. ఇందులో కూడా కామెడీ లేదు. తాజాగా కొరటాల దర్శకత్వంలో వచ్చిన 'జనతాగ్యారేజ్‌' చిత్రం కూడా సీరియస్‌ మూడ్‌లో సాగే చిత్రమే. కానీ నేటితరం ప్రేక్షకులు వైవిధ్యంతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ను కూడా ఎక్కువగా ఆదరిస్తున్నారు. మొత్తానికి వైవిధ్యభరితమైన చిత్రాలకే ప్రాధాన్యం ఇస్తోన్న ఎన్టీఆర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లేకున్నా ఫర్వాలేదు. వైవిధ్యం ఉంటే చాలు అంటున్నాడు. అలాగే ఈమధ్య ఎన్టీఆర్‌ కూడా నందమూరి వంశం, తాత ఎన్టీఆర్‌ నామస్మరణ, మాస్‌కు నచ్చే నసపెట్టే సెల్ప్‌డబ్బా డైలాగులు లేకపోవడం కూడా కాస్త ఉపశమనం ఇస్తోంది. మొత్తానికి ఎన్టీఆర్‌ కొత్తదనానికి పెద్ద పీట వేస్తూ ఆల్‌రౌండర్  అనిపించుకునే చిత్రాలు చేయడం హర్షించదగ్గ పరిణామం. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement