Advertisement

వర్మ కళ్ళు పడ్డాయ్..ఇంకెందుకు వదులుతాడు!


వర్మ,.. రాంగోపాల్‌ వర్మ.. ఈమధ్యకాలంలో ఆయన కేవలం తనకు నచ్చిన కథలు రాసుకోవడం మానివేశాడు. ఎక్కడైనా మంచి రియలిస్టిక్‌, కాంట్రవర్శీ కథలు, వ్యక్తుల జీవితాలు తీయడంపై మోజు పెంచేసుకుంటున్నాడు. ఇప్పటికే పరిటాల రవి జీవితచరిత్ర ఆధారంగా 'రక్తచరిత్ర'ను రెండు భాగాలుగా తెరకెక్కించాడు. ఇక 'వీరప్పన్‌, 26/11, వంగవీటి, డాన్‌ ముత్తయ్య' వంటి స్టోరీలను తెరకెక్కించాడు.. తెరకెక్కిస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన తెలంగాణ డాన్‌ నయీముద్దీన్‌ ఎన్‌కౌంటర్‌... గత కొద్ది రోజుల కిందట జరిగిన తెలంగాణ గ్రేహోండ్స్‌ చేతిలో ప్రాణాలు కోల్పోయిన డాన్‌ కథకు ఇప్పుడు వర్మ ఎంతగానో ఇన్‌స్పైర్‌ అయ్యాడు. నక్సలైట్‌గా, పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌గా, డాన్‌గా మారిన నయీం నిజజీవితంపై వర్మ కళ్లుపడ్డాయి. ప్రస్తుతం ఆయన నయిం నిజజీవితంలోని వివాదాస్పద అంశాలను సేకరిస్తున్నాడు. నయిం జీవిత కథను ఒకే భాగంలో చెప్పలేమని, అందుకే మూడు భాగాలుగా ఆయన జీవిత కథను బయోపిక్‌గా తీస్తానంటున్నాడు వర్మ. మరి వర్మ ఈసారి తన ప్రయత్నంలో ఎంత వరకు సక్సెస్‌ అవుతాడో వేచిచూడాల్సివుంది. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement