Advertisement

ఫ్యాన్స్ ని, మీడియా ని అవమానించిన చిరు!!


మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే అంటే రెండు తెలుగు రాష్ట్రాల మెగా అభిమానులకు ఒక ఉత్సవం లాంటిది. అయన జన్మదినం పురస్కరించుకుని మెగా అభిమానులు చిరు పేరు మీద పూజలు ,హోమాలు రాష్ట్ర మంతటా నిర్వహించారు. అంతే కాకుండా అయనకు ఘనంగా పుట్టినరోజు వేడుకలు కూడా ఏర్పాటు చేశారు. ఈ వేడుక హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నిన్న సాయంత్రం  (22-08-16) జరిగింది. ఈ వేడుకకి మెగా హీరోలందరూ హాజరయ్యారు. ఒక్క చిరంజీవి, పవన్ కళ్యాణ్ తప్పించి అందరూ హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ అసలు ఇలాంటి ఫంక్షన్స్ కి దూరం గా ఉంటాడు కాబట్టి అతను రాకపోయినా పెద్దగా పట్టించుకునే వారు లేరు. అందునా ఈ మధ్య మెగా ఫ్యామిలీ లో గొడవల కారణం గా అన్నదమ్ములు పెద్దగా కలవడం లేదని సమాచారం. అయినా మా మధ్యన ఏమి లేదు అని చెప్పినప్పటికీ వారు ఒకరికొకరు సహకరించుకోవడం మానేశారని టాక్. అయితే హైదరాబాద్ లో జరిగిన వేడుకలకు మా నాన్న చిరంజీవి గారికి ఏదో పని పడడం వల్ల ఆయన హాజరు కాలేక పోయారని.... అందుకే మేము హాజరయ్యాము అని... ఈసారికి ఈ సెలెబ్రేషన్స్ మమ్మల్ని చేసుకోమన్నారు అని రామ్ చరణ్.. ఫాన్స్ కి చెప్పాడు. అల్లు అర్జున్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నాగబాబు, అల్లు అరవింద్ లు ఈ వేడుకకి హాజరైన వారిలో వున్నారు. ఇక ఒక్కో మెగా హీరో స్టేజి మీదకెక్కి చిరంజీవి గారి గురుంచి గొప్పగా మాట్లాడేశారు. రామ్ చరణ్, నాగబాబు, అల్లు అరవింద్ లు అయితే  మెగా ఫాన్స్ కి మెమొంటోలు కూడా అందజేశారు. 

Advertisement

ఇదిలా ఉండగా మరో చోట కూడా మెగాస్టార్ బర్త్ డే వేడుకలు ఘనం గా జరిగాయి. ఆ పార్టీ  కేవలం విఐపిలకు మాత్రమే. అంటే సినిమా ఇండస్ట్రీలోని వారు, పొలిటీషియన్స్ మాత్రమే హాజరైన కాస్టలీ పార్టీ అన్నమాట. ఈ సెలెబ్రేషన్స్ కి వేదికగా హైదరాబాద్ లోని పార్క్ హయ్యత్ నిలిచింది. ఈ సెలెబ్రేషన్స్ కి చిరంజీవి కూడా హాజరయ్యాడు. మరి ఫాన్స్ ఏర్పాటు చేసిన పుట్టిన రోజు వేడుకకి హాజరవ్వకుండా కేవలం పర్సనల్ పార్టీకి చిరు హాజరవ్వడం పై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. మరీ ఫాన్స్ అంటే అంత లోకువా అని... మాకు మీరే పెద్ద దిక్కు అని ఫాన్స్ ని పొగిడినంతసేపు లేదు. ఇలా అవమానించడానికే అని అంటున్నారు చాలామంది. అంతే కాకుండా పార్క్ హైయ్యత్ లో జరిగిన వేడుకలకు మీడియా కి పూర్తి స్థాయిలో ఎంట్రీ లేదు. కేవలం రెడ్ కార్పెట్ వరకే అనుమతించి... లోపల పార్టీకి అనుమతించలేదు. అంతే కాకుండా మీడియా వారికి రోగులకు ఇచ్చినట్లుగా బిర్యానీ పాకెట్స్ ఇవ్వడం కూడా..ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తుంది. మీడియాని చిరు ఎప్పుడూ చిన్న చూపు చూస్తాడనే టాక్ వున్నా..సిగ్గు లేకుండా చిరుకు సపోర్ట్ చేసే మీడియా కి మరోసారి మాంచి ఝలక్ ఇచ్చాడు చిరు. అటు ఫ్యాన్స్ ని.. ఇటు మీడియా ని బర్త్ డే సాక్షిగా అవమానించి..మరోసారి వార్తల్లో నిలిచిన చిరు పట్ల ఇకనైనా మీడియా, అభిమానులు కాస్తంత దూర దృష్టితో ఆలోచిస్తే బావుంటుందని సినీ పెద్దలు కొందరు అనుకుండుండటం కూడా విశేషం. మరి 9 సంవత్సరాల తర్వాత మొహానికి రంగు వేసుకుని హీరో గా రీ ఎంట్రీ ఇస్తున్న టైములో చిరు ఇలా చేయడం ఎంత వరకు కరెక్టో..ఆ మెగా ఫ్యామిలీ కే తెలియాలి. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement