Advertisement

అవసరాలకి హిట్ ఇందులోనే ఉందా..!


‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో డైరెక్టర్‌గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి... దర్శకత్వం వహించిన మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన శ్రీనివాస్ అవసరాల... ఇప్పుడు 'జ్యో అచ్యుతానంద'తో మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అవసరాల ఒక నటుడిగా ఎంత పేరును సంపాదించుకున్నాడో... అలాగే తీసిన మొదటి సినిమాతోనే  డైరెక్టర్ గా కూడా అంతే మంచి పేరును తెచ్చుకున్నాడు. ఇక నారా రోహిత్, నాగశౌర్యని అన్నదమ్ములుగా చూపిస్తూ.... వీరిద్దరి ఫ్రెండ్ గా రెజీనాని పెట్టి 'జ్యో అచ్యుతానంద' సినిమాని తెరకెక్కిస్తున్నాడు శ్రీనివాస్ అవసరాల. ఈ సినిమా పాటలు ఆదివారం శిల్పకళావేదికలో విడుదలయ్యాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ ఆధ్యంతం ప్రేక్షకులను మెప్పించిందనే చెప్పాలి. ఈ ట్రైలర్ లో అన్నదమ్ములైన నారా రోహిత్, నాగశౌర్యలు ఇద్దరూ వీరికి కామన్ ఫ్రెండ్ అయిన రెజీనాని ప్రేమిస్తారు. అయితే రేజీనాకి ఈ విషయం తెలిసినట్లు ఉండదు. అందుకే ఇద్దరితో చాలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. మరి వీరిద్దరి ప్రేమలో రెజినా ఎవరికీ పడిపోతుంది లేక ఇద్దరినీ వద్దనుకుంటుందా అనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమాని శ్రీనివాస్ అవసరాల చాలా చక్కని కథాంశాన్ని తీసుకుని తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఈ కాలానికి అనుగుణంగా యువతకు నచ్చే విధంగా డైలాగ్స్ ని ఈ సినిమా ట్రైలర్ లో చూపించాడు శ్రీనివాస్. మొదటి సినిమా ‘ఊహలు గుసగుసలాడే’ లో కూడా ఇలా ట్రయాంగిల్ లవ్ ని చూపించాడు. మరి ఇప్పుడు తీసే సినిమా కూడా అదే కోవలోకి వచ్చేటట్లు ఉంది. ఈ విషయం తెలియాలి అంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement