Advertisement

వెండితెరపైకి గోపిచంద్ జీవితం....!


బ్యాట్మింటన్ క్రీడాకారుడిగా అద్భుత విజయాలు సాధించిన గోపిచంద్, ఆ తర్వాత ఇన్నింగ్స్ గా అకాడమీని స్థాపించి అనేక మంది షట్లర్లను తీర్చిదిద్దుతున్నాడు. ఆ అకాడమీలో సాధన చేసిన అనేకమంది గొప్ప గొప్ప విజయాలు సాధించి దేశానికే ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతున్నారు. గత ఒలంపిక్స్ లో సైనా నెహ్వాల్ ఓ పతకంతో మెరువగా, ఇప్పుడు  జరుగుతున్న రియో ఒలంపిక్స్ లో తెలుగు తేజం సింధు వెండి పతకాన్ని సొంతం చేసుకొని భారత్ కు ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టింది. వీరిద్దరి విజయం వెనుక ఆ అకాడమీని స్థాపించి కోచ్ ఇస్తున్న గోపిచంద్ కృషి ఎంతైనా ఉందని తెలుస్తుంది.

Advertisement

కాగా గోపీచంద్ జీవితం ఆధారంగా త్వరలో ఒక సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఆ రకంగా ప్రచారం కూడా సాగుతుంది.  అప్పుడే ఈ చిత్రం లో హీరో గా సుధీర్ బాబు చేస్తాడని.... అదీ గోపీచంద్ పాత్రలో నటించనున్నాడని సమాచారం. కాగా ఈ చిత్రానికి సంభదించిన పని అంతా దాదాపు ఓ సంవత్సరం నుంచి జరుగుతోందని, నవంబర్ లో ఈ చిత్రం ప్రారంభం కాబోతుందన్నట్లు వెల్లడౌతుంది.  

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement