Advertisement

సింధుకు అభినందనల వెల్లువ..!


ఒలింపిక్స్ లో గట్టిపోటీని ఇచ్చి ఎంతో ఉత్కంఠతకు తెరలేపి ఎట్టకేలకు రజతం సాధించింది పీవి సింధు. ఈమె రజితం సాధించిన తొలి మహిళా ప్లేయర్ గా నిలిచింది. ఫైనల్ కు చేరిన ఇరువురి మధ్య దాదాపు గంటకు పైగా హోరాహోరీ కొనసాగింది. ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ కరోలినా మారిన్ 21-19, 12-21, 15-21 తేడాతో భారత సంచలనం అయిన సింధుపై నెగ్గింది. సింధు గెలిచింది స్వర్ణమా..  రజతమా... అన్న విషయాన్ని ప్రక్కన పెడితే ఫైనల్లో సింధు చాలా ప్రతిభావంతమైన ఆట తీరును ప్రదర్శించి ప్రపంచం గర్వించేలా భారత్‑కు పతకాన్ని అందించింది. మొదటి రెండు మ్యాచ్ లు చెరొకటి గెలవడంతో మూడవ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది.

Advertisement

మూడో సెట్ లో తోలి అర్ధభాగం వరకు హోరాహోరీ గా సాగినా తర్వాత సింధు తడబడడంతో21-15తేడాతో మారిన్ విజయం సొంతం చేసుకుంది. దీనితో బ్యాట్మింటన్ మహిళల సింగిల్స్ విభాగం లో మారిన్ స్వర్ణ పతాకాన్ని పొందగా, సింధు సిల్వర్ మెడల్ ను గెలిచింది. ఒలంపిక్స్ లో వెండి పథకం సాధించిన తొలి భారతీయ మహిళామణిగా సింధు రికార్డ్ సృష్టించింది.

దాంతో ఒక్కసారిగా పీవీ సింధుకు అభినందనలు వెల్లువ కొనసాగుతుంది. కోట్లాది భారతీయుల ఆకాంక్షను నెరవేర్చేందుకు పోరాడిన భారత షట్లర్‑ పీవీ సింధును టాలీవుడ్ యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ అభినందనలతో ముంచెత్తాడు. అంతేకాకుండా పీ.వి. సింధుకి తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల నజరానా ప్రకటించింది. సూపర్ స్టార్ రజినీకాంత్ అయితే ఏకంగా సింధు రియో ఒలింపిక్స్ లో ఆడిన ఆట తీరుకు ఫ్యాన్ అయిపోయానని చెప్పారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement