Advertisement

'బొమ్మరిల్లు' కి 10..! మరి బొమ్మరిల్లు-2 కి?


తెలుగు సినిమా పరిశ్రమలో బొమ్మరిల్లు సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. దశాబ్దం కాలం నుండి సినిమా చరిత్రకారులు, విమర్శకులంతా బొమ్మరిల్లుకు ముందు బొమ్మరిల్లు తర్వాత అన్న రేంజ్ లో మాట్లాడుతున్నారంటే ఆ చిత్రం పరిశ్రమపై చూపిన ప్రభావం తీవ్రమైందనిగానే చెప్పాలి.  బొమ్మరిల్లు చిత్రం విడుదలైనప్పటి నుండి దర్శక నిర్మాతలు, రచయితలు వారి వారి ఆలోచనలను మార్చుకున్నారు.

Advertisement

సరిగ్గా దశాబ్దం క్రితం 2006 ఆగష్టు 9 వతేదీ విడుదలై తెలుగు ప్రేక్షకులను, సినిమా పండితులను ఆలోచనలో పడేసిన చిత్రం బొమ్మ రిల్లు. చక్కటి కుటుంబ కథా చిత్రంగా, తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఎమోషనాలిటీని సంఘర్షణలో పడేసి ప్రేక్షకులను కదిలించిందీ చిత్రం. సినీ పెద్దల మెదళ్ళను తట్టి లేపింది. నిర్మాణ పరంగా శ్రీ వేంకటేశ్వర ఫిలిమ్స్ కు పేరు ప్రఖ్యాతులను తెచ్చి పెట్టి దిల్ రాజు పేరు నిలబెట్టిన చిత్రం. చిత్రంలోని ప్రతిపాత్ర అంటే సిద్ధార్ద్, జెనీలియా, ప్రకాష్ రాజ్, జయసుధ తదితర పాత్రలు  తమదైన శైలిలో అద్భుతంగా నటించి శాశ్వత కీర్తిని సంపాదించుకున్నారు. దర్శకుడికి  ఈ చిత్రంతోనే బొమ్మరిల్లు భాస్కర్ అని పేరు కూడా పడిపోయింది. ఇంకా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, అబ్బూరి రవి మాటలు అన్నీ అట్టే కుదిరాయి. చివరగా చెప్పాలంటే బొమ్మరిల్లు చిత్రం తెలుగు సినిమాకు ఓ ఆణిముత్యం లాంటివి. గొప్ప క్లాసిక్. అసలు ఆ చిత్రం నుండే ఎండ్ టైటిల్స్ పడేప్పుడు కూడా కథను చెప్పడానికి మార్గదర్శం అయిందని చెప్పవచ్చు. అది సరే.... మరి ఆ మధ్య బొమ్మరిల్లు-2 చిత్రం రాబోతుందంటూ ఓ కోడి కూత వినిపించినట్టు వార్తలు పొక్కాయి గానీ, తర్వాత దాని మీద ఊసే లేదు. ఇలా వార్తలు రేపి రేపి అంతా మీరే చేశారు నాన్న... అంటూ దిల్ రాజు గారే పూనుకొని అలా బొమ్మరిల్లు-2 పూర్తి చేసి ఇలా ఎవరికీ తెలియకుండా విడుదల చేయడం ఖాయం.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement