Advertisement

జగన్‌ చేయలేనిది.. కెవిపి చేశాడు!


ఇంతకాలం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేదని చెబుతూ దానికి టిడిపిదే బాధ్యతను అంటూ విమర్శలు చేస్తూ, కేంద్రంలోని బిజెపిని మాత్రం ఏమీ అనకుండా తెదెపాకు, బిజెపి మధ్య చిచ్చుపెట్టాలని భావించిన జగన్‌ వ్యూహం ఇప్పటివరకు పనిచేయలేదు. కానీ కాంగ్రెస్‌ సీనియన్‌ నాయకుడు, వైఎస్‌ ఆత్మబంధువు అయిన కెవిపి రామచంద్రరావు మాత్రం ఆ పనిని తానే చేసి కొంతలో కొంత బిజెపి, టిడిపిల మధ్య ఉన్న విబేధాలను రగిలించడంలో కాస్త విజయం సాధించాడు. రాజ్యసభలో కెవిపి ప్రవేశ పెట్టిన ఏపీ ప్రత్యేకహోదా ప్రైవేట్‌ బిల్లు సందర్భంగా కెవిపితో శ్రుతి కలిపి సుజనాచౌదరి, సీఎం రమేష్‌లు చేసిన ప్రసంగాలు బిజెపిని కాస్త ఇబ్బంది పెట్టాయనే భావించాల్సివుంది. ఏపీకి ప్రత్యేకహోదా లభించకపోవడానికి టిడిపి చేతగాని తనమే కారణమని, ముందుగా మోడీ క్యాబినేట్‌లో ఉన్న మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్న జగన్‌ బిజెపికి, టిడిపికి మధ్య చిచ్చు పెట్టాలనుకున్న జగన్‌ ప్రయత్నం నెరవేరకపోయినా, కెవిపిమాత్రం ఆ పని చేతల్లో చేసి చూపించాడు. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement