Advertisement

ఆగస్టు పండగ ఈసారి అనంతపూర్‌లో..?


రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత టిడిపి ప్రభుత్వం ఏపీలో స్వాతంత్రదినోత్సవ వేడుకలను వివిధ ప్రాంతాల్లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కర్నూల్‌, విజయవాడల్లో జరిపిన ప్రభుత్వం ఈసారి మాత్రం రాజధాని అమరావతిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరపాలని నిర్ణయించినప్పటికీ.. అప్పటికి అమరావతిలో పూర్తి సౌకర్యాల ఏర్పాటు కష్టం అని భావించిన బాబు ఈసారి అనంతపురంలో సాతంత్య్రదినోత్సవ వేడుకలను జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే జరిగితే మూడేళ్లలో రెండుసార్లు రాయలసీమలోనే ఈ వేడుకను జరిపిన ఘనత చంద్రబాబుకు దక్కుతుంది. రాయలసీమ ప్రజల్లో వైసీపీ ప్రాంతీయ విభేదాలు చూపి బలపడాలని భావిస్తున్న తరుణంలో రాయలసీమకు తాము ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నామనే సంకేతాలను పంపడం కోసమే బాబు ఈ ఎత్తుగడ వేశాడని అర్దమవుతోంది. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఇప్పటి నుంచే అనంతపురంలో ఈ వేడుకలు జరపడానికి సన్నాహాలు మొదలైనట్లు సమాచారం. ఈ విషయం తెలిసి అనంతపురం ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement