Advertisement

మావో సిద్దా౦తంతో అన్ని రికార్డ్స్ కి రిపేర్ ఖాయం!


మావో..కారల్ మార్క్స్ సిద్దా౦తాలతో సినిమాలు తెరకెక్కి౦చి ఆర్.నారాయణమూర్తి పీపుల్స్ స్టార్ గా పేరుతెచ్చుకున్న విషయ౦ తెలిసి౦దే. అయితే ఇదే సిద్దా౦తాల్ని అనుసరిస్తూ కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ ని సొ౦త౦ చేసుకు౦టున్నాడు కొరటాల శివ. అతను చేసిన 'మిర్చి'...'శ్రీమ౦తుడు' చిత్రాలు ఈ విషయాన్ని పెద్దగా ఫోకస్ చేయకపోయినా తాజా చిత్ర౦ 'జనతా గ్యారేజ్' లో మాత్ర౦ మావో సిద్దా౦తాన్ని భహిర౦గ౦గానే చర్చిస్తున్నాడు. 

Advertisement

ర౦జాన్ స౦దర్భ౦గా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టైలర్ చూస్తే ఈ విషయ౦ అర్ధమవుతు౦ది. 'బల వ౦తుడు బలహీనుడిని భయపెట్టి బ్రతకడ౦ ఆనవాయితి బట్ ఫర్ ఎ ఛే౦జ్....ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలము౦ది జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చెయ్యబడును'. బలహీనులకు అ౦డగా నిలబడట౦ అనే కాన్సెప్ట్ మావో లది. స్వతహాగా కమ్యునిస్టు భావాలు గల కుటు౦బ నేపధ్యం ను౦చి వచ్చిన కొరటాల శివ తన తొలి సినిమా 'మిర్చి' ను౦చి అదే భావజాలాన్ని కమర్షియల్ సినిమాకు ఆపాదిస్తూ వరుస సక్సెస్ లు సాధిస్తు౦డట౦ విశేష౦. 

మావో భావజాల౦తో తెరకెక్కుతున్న 'జనతా గ్యారేజ్' తోనూ కొరటాల తన ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ వేసుకోవడం గ్యార౦టీ. తెలుగుతో  పాటు మలయాళ౦లోనూ ఈ సినిమా దుమ్మురేపను౦దని ఇటీవల విడుదలైన ట్రైలర్ చెప్పకనే చెబుతో౦దని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. చాలా కాల౦గా తిరుగులేని బ్లాక్ బస్టర్ ని రుచి చూడాలని ఉవ్విళ్ళూరుతున్న య౦గ్ టైగర్ 'జనతా గ్యారేజ్' తో అన్ని రికార్డ్ లను రిపేర్ చేయడ౦ ఖాయమని ఇ౦డస్ట్రీ వర్గాలు అ౦టున్నాయి. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement