Advertisement

సమంత కోసం చైతూ సినిమా కష్టాలు!


నాగచైతన్య, సమంతల ప్రేమ వ్యవహారం ఇప్పుడు ఓ ఓపెన్‌ సీక్రెట్‌ అయిపోయింది. మొదట్లో అవునా? కాదా? అని అనుమానాలు వ్యక్తమైనా ఈమధ్య గోవాలో చైతు, సమంతలు కలిసి 'అ..ఆ' చిత్రం చూసిన సంగతి నిజమేనని తేలడంతో ఇప్పుడు అందరూ అది నిజమే అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. కానీ ఇప్పటికీ అక్కినేని కుటుంబం దీన్ని నిర్ధారించి, క్లారిటీ ఇవ్వకుండా ఇంకా రూమర్‌గానే ఈ విషయాన్ని ఖండిస్తూ వస్తున్నారు. అయితే వీరి పెళ్లికి చైతూ తండ్రి నాగార్జునకు అభ్యంతరాలు ఉన్నట్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇది నిజమేనని రూడీ చేసే మరో వార్త ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్‌ చేస్తోంది. నాగ్‌ అడ్డుచెబుతుండటంతో చైతన్య తన తల్లి లక్ష్మీ దగ్గుబాటి సహాయం తీసుకుని ఆమె నుండి సపోర్ట్‌ను ఆశిస్తున్నాడట. దాంతో చైతూ తన తల్లిని కలిసి 'బొమ్మరిల్లు' తరహాలో ఓ రోజు తన తల్లిని చెన్నైలోని సమంత ఇంట్లో గడపమని కోరడంతో ఆమె సమంత ఇంట్లో ఓ రోజు గడిపి ఆ ఫ్యామిలీ పద్దతులు, సమంత గుణగణాలను తెలుసుకొని ఓకే చెప్పిందని సమాచారం. అసలు నాగ్‌ నిర్ణయమే అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సమంత వద్దా? లేక అసలు సినిమా అమ్మాయే వద్దా? నాగ్‌కు ఈ పెళ్లి ఎందుకు ఇష్టం లేదు? అనేది అనుమానం అందరికీ కలుగుతోంది. నాగ్‌కు సినిమా అమ్మాయిలంటే చెడు అభిప్రాయం ఉందా? అంటే అదీ లేదని గట్టిగా చెప్పవచ్చు. అందుకు ఆయన భార్య 'అమల'నే పెద్ద ఉదాహరణ అని చెప్పవచ్చు. అంతేకాదు.. నాగ్‌కు ఎవ్వరికీ లేనంతగా ఓపెన్‌ మైండ్‌ ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement