Advertisement
Google Ads BL

తన విలన్ పై చరణ్‌ ప్రశంసల వర్షం!


ప్రతినాయకుడి పాత్ర బలంగా ఉంటేనే ఎంతటి స్టార్‌హీరో క్యారెక్టర్‌ అయినా ఎలివేట్‌ అవుతుంది. ఈ విషయం అందరూ ఒప్పుకుంటారు.  తమిళ 'తని ఒరువన్‌' చిత్రంలో ప్రతినాయకుడిగా నటించిన అరవింద్‌స్వామి నటనను ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుతుంది.  ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో కూడా అరవింద్‌స్వామిని రీప్లేస్‌ చేసి ఎవరిని పెట్టినా ఆ పాత్రకు న్యాయం చేయలేరనిపించి తెలుగు రీమేక్‌ 'ధృవ'లో కూడా రామ్‌చరణ్‌కు ప్రతినాయకుడిగా అరవింద్‌స్వామినే తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌లోకి రామ్‌చరణ్‌ రీసెంట్‌గా జాయిన్‌ అయ్యాడు. కాగా ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌ తర్వాత మరో షెడ్యూల్‌ కాశ్మీర్‌లో ప్లాన్‌ చేశారు. అయితే ఈ చిత్రం షూటింగ్‌ జరిగిన రెండు షెడ్యూల్స్‌ అవుట్‌పుట్‌ పట్ల రామ్‌చరణ్‌ ఎంతో హ్యాపీగా ఉన్నాడట. ఇక ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న అరవింద్‌స్వామి నటనపై చెర్రీ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. ఈ చిత్రానికి ఆయన పెద్ద మేజర్‌ ఎస్సెట్‌ అవుతాడనే నమ్మకాన్ని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చరణ్‌ వ్యక్తం చేశాడు. నిజమే.. తమిళంలోలాగానే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తే హీరో పాత్ర కన్నా విలన్‌ పాత్ర పెద్ద హైలైట్‌ కావడం ఖాయంగా కనిపిస్తోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs