Advertisement

కమల్‌, రజనీలకు అగ్రిమెంటే అడ్డు!


గతంలో తమిళస్టార్స్‌ రజనీకాంత్‌, లోకనాయకుడు కమల్‌హాసన్‌లు పలు చిత్రాల్లో కలిసి నటించారు. కానీ వారిద్దరు మరలా కలిసి నటించి చాలా కాలమే అవుతోంది. తాజాగా శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా అక్షయ్‌కుమార్‌ విలన్‌గా నటిస్తున్న 'రోబో2.0'లో విలన్‌గా అక్షయ్‌ స్ధానంలో మొదట కమల్‌ను అడిగాడు శంకర్‌. కానీ కమల్‌ ఒప్పుకోలేదు. దానికి బలమైన కారణమే ఉందంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. భవిష్యత్తులో తామిద్దం కలిసి నటించాలంటే తామిద్దరిలో ఎవరో ఒకరు ఆ చిత్రానికి నిర్మాతగా ఉండాలని కమల్‌, రజనీలు అగ్రిమెంట్‌ చేసుకున్నారట. 'రోబో2.0' చిత్రం భారీ బడ్జెట్‌ చిత్రం కావడంతో తామిద్దరూ దానిని ప్రొడ్యూస్‌ చేసే అవకాశం లేకపోవడం వల్లే ఈ చిత్రంలో విలన్‌ పాత్రను తాను చేయలేకపోయానని కమల్‌ మీడియాకు తెలిపాడు. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement