Advertisement

ఇక ప్రత్యేకహోదా వచ్చే అవకాశమే లేదు!


ప్రస్తుతానికి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా వచ్చే ఎన్నికల నాటికైనా కేంద్రంలోని బిజెపి అధిష్టానం ఇవ్వకపోతుందా? అనే ఆశ అందరిలో మిణుకుమిణుకుమంటోంది. కానీ వచ్చే ఎన్నికల నాటికి కూడా ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే అవకాశం లేదని ఇప్పుడు స్పష్టం అవుతోంది. వాస్తవానికి ఏపీకి ప్రత్యేక హోదాను మూడు రాష్ట్రాల వారు వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, బీహార్‌ రాష్ట్రాలు ఇందులో ముఖ్యమైనవి. రాజకీయంగా చూసుకుంటే బిజెపి ఎప్పటికైనా అధికారం లభించే రాష్ట్రాల్లో  బీహార్‌ ఒకటి. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్‌కుమార్‌ కూటమి చేతుల్లో బిజెపి ఓటమిపాలైంది. భవిష్యత్తులో ఆ రాష్ట్రంలో మరలా బిజెపి అధికారంలోకి రావాలంటే  బీహార్‌ రాష్ట్రం వ్యతిరేకిస్తున్న ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో బిజెపి వారి ఒత్తిడికి తలొగ్గక తప్పదు.

Advertisement

ఇక దక్షిణాదిలో బిజెపికి బాగా ఇమేజ్‌ ఉన్న రాష్ట్రం కర్ణాటక. ఇక్కడ కూడా బిజెపి కర్ణాటక మాటకు వ్యతిరేకంగా ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేదు. మరోవైపు ఏపీ ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తున్న మరో ప్రభుత్వం తమిళనాడులోని జయలలిత ప్రభుత్వం. వాస్తవానికి నిన్నటి ఎన్నికల్లో తమిళనాడులో జయలలిత పార్టీ విజయఢంకా మోగించింది. భవిష్యత్తులో జయలలిత అనుగ్రహం కేంద్రంలోని బిజెపికి చాలాకీలకం. రాజ్యసభలో ఆమె మద్దతు విషయంలో ప్రతి విషయంలోనూ బిజెపి ఆమెపై ఆశలు పెంచుకుంటోంది. అలాంటి పరిస్థితుల్లో ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా బిజెపి ఏమీ చేయదు అన్నది వాస్తవం. 

ఇక ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో తెలంగాణ సర్కార్‌ ధోరణి కూడా ఏపీకి వ్యతిరేకమే. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే కేసీఆర్‌ ప్రభుత్వం వద్దని చెప్పడం లేదు కానీ ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే తమకీ ఇవ్వాలని లింక్‌ పెడుతోంది. వాస్తవానికి బిజెపికి ఏపీ కంటే తెలంగాణలోనే పట్టు ఎక్కువ. అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని, వచ్చే ఎన్నికల నాటికి అక్కడ సొంతంగా పుంజుకోవాలని బిజెపి భావిస్తోంది. ఇలాంటి పరిస్తితుల్లో ఏపికి ప్రత్యేకహోదా ఇచ్చి తెలంగాణకు ఇవ్వకపోతే అక్కడి ప్రజలు బిజెపిపై మండిపడటం ఖాయం. ఇవ్వన్నీ దృష్టిలో ఉంచుకుంటే బిజెపి వచ్చే ఎన్నికలోపు కాదు కదా...! అసలు ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే అవకాశమేలేదని స్పష్టం అవుతోంది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement