Advertisement

చిరు మూవీకి నో చెప్పాడట!


మెగాస్టార్ చిరంజీవి, వినాయక్ దర్శకత్వంలో తన 150వ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా జూన్ 6 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. 'కత్తి' రీమేక్ గా రూపొందుతోన్న ఈ సినిమాకు 'కత్తిలాంటోడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ తన నటిస్తోన్న 'దృవ' షూటింగ్ ను కూడా వాయిదా వేసినట్లు సమాచారం. పక్కా ప్లాన్ తో ఎంతో జాగ్రత్తగా ఈ సినిమాను నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో చిరంజీవి స్నేహితుడి పాత్ర కోసం సునీల్ ను సంప్రదించడం, దానికి సునీల్ ఓకే చెప్పడం జరిగిపోయాయి. తీరా ఇప్పుడేమో వాళ్ళు అడిగిన డేట్స్ సునీల్ దగ్గర లేవట. చిరు సినిమా కోసం చిత్రబృందం నలభై రోజులు పాటు డేట్స్ కేటాయించమని సునీల్ ను అడిగారట. సునీల్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. దాని వలన వారు అడిగిన డేట్స్ ను అడ్జస్ట్ చేయలేకపోయినట్లు సమాచారం. సునీల్ స్థానంలో వెన్నెల కిషోర్ ను తీసుకోవాలని యూనిట్ మెంబర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement