Advertisement

అచ్చెన్నాయుడు దే కీలకపాత్ర!


కర్నూలు జిల్లాలో ఉప్పు-నిప్పుగా ఉన్న భూమా నాగిరెడ్డి, శిల్పా సోదరుల మద్య సయోధ్య ఏర్పడింది. చంద్రబాబును కలిసిన తర్వాత వీరు విలేకరులతో మాట్లాడుతూ... తామిద్దం ఇక నుండి కలిసి పనిచేస్తామని చెప్పారు. పార్టీ కోసం, ప్రభుత్వం కోసం కర్నూల్‌జిల్లాలో కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చామని, తమ జిల్లాలోని మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టిడిపిలో త్వరలో చేరనున్నారని వారిద్దరూ తెలిపారు. సంక్షేమ పధకాల్లో సమన్వయంతో లబ్దిదారుల ఎంపికపై సమన్వయంతో పనిచేస్తామని, తమమధ్య విబేదాలు సమసిపోయాయని, చంద్రబాబు మాటే తమకు వేదవాక్కని ఈ ఇద్దరు స్పష్టం చేశారు. తామిద్దం ఇకపై అభివృద్దిపైనే దృష్టి కేంద్రీకరిస్తామని వారు విలేకరుల సాక్షిగా చెప్పారు. మొత్తానికి వీరి మధ్య ఉన్న వ్యక్తిగత విబేధాల వల్ల కర్నూల్‌ జిల్లాలో టిడిపికి భారీ నష్టం చేకూరుతుందని అందరూ భావించారు. కానీ ట్రబుల్‌ షూటర్‌ అయిన చంద్రబాబు వీరిద్దరిని ఏమాటలు చెప్పి మాయచేసాడో అని రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కర్నూల్‌ జిల్లా ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్న అచ్చెన్నాయుడు వీరిద్దరిని కలపడంలో కీలకపాత్ర పోషించాడని, అందుకు ఆయన సీఎం చంద్రబాబు నుండి కూడా అభినందనలు అందుకున్నాడని తెలుస్తోంది. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement